గాంధి పుట్టిన దేశమా ఇది?

Share Icons:

 

[pinpoll id=”63106″]

 

 

గాంధీ అనే రెండు ఆక్షరాలు ప్రేమ అనే రెండక్షరాల కంటే బలమైనవి. శక్తివంతమైనవి, స్ఫూర్తివంతమైనవి. ఎందుకంటే ప్రేమ కోసం ఒక దేశం మొత్తం ఒక. వ్యక్తి వెంట నడవలేదు. కానీ భారతీయులు స్వేచ్ఛకోసం గాంధీ వెంట ప్రేమతో నడిచారు. ఆయన ప్రకటించిన ప్రతి ఉద్యమంలో స్త్రీ, పురుష బేధం లేకుండా పిల్లా జెల్లా అందరూ పాల్గొన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు, ఆస్తులు త్యాగం చేశారు. ఉద్యోగాలు, చదువులు వదిలిపెట్టి స్వరాజ్యసమరశంఖం పూరించారు.

దేశం యావత్తు ఒకే గొంతై నినదించారు. దేశదాస్య శృంఖలాలు తెంచారు. అందుకే గాంధీజీ అహింసా సిద్దాంతం ఆ తరువాత అనేక దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. కానీ స్వదేశంలో గాంధీ ఆచరించిన విలువలకు అర్థంలేకుండా పోయింది. సత్యం, అహింస, పరమత సహనం, నిజాయితీ, పారదర్శకత, సామాన్య జీవన శైలి వంటివి ఈనాడు పనికిమావలిన పాత చింతకాయ పచ్చిడి కబుర్లుగా మారిపోయాయి. రాజకీయాలలో విలువలన్నవి దాదాపు శూన్యం కాగా, తక్కిన రంగాలలో కూడా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో మహాత్ముని 149 వ జయంతి వేడుకలు ఈ అక్టోబరు 2 వ తేదీన జరుపుకుంటున్నాం. ఈ ఏడాదిని స్వచ్ఛభారత్ ఏడాదిగా భావించి పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కేవలం భౌతిక సుఖాల కోసం, అక్రమార్జనకోసం, విలాసవంతమైన జీవన విధానాలకోసం విలువలు తాకట్టు పెడుతున్న నేటి సమాజంలో గాంధీమహాత్ముని సూక్తులు ఆచరణీయమేనా అన్నదే ప్రశ్న. ముఖ్యంగా యువతరానికి గాంధీ గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించుకున్నపుడు నిరాశకలుగుతుంది. కదా, అటువంటి సమాజంలో ఉన్నాం. జాతి పిత గురించి అవగాహన లేని కాలం వచ్చేసింది. ఏమంటారు. పరిస్థితి మారాలంటే ఏం చేయాలంటారు.

మామాట: శాంతి, అహింస లేని సమాజం ఆటవిక సమాజమే కదా.

Leave a Reply