మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరనున్నారా?

Is Motkupalli ready to join TRS party
Share Icons:

హైదరాబాద్, 22 మే:

తెలంగాణ సీనియర్ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారా? అంటే.. సంబంధిత రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక వచ్చే నెలలో ఆయన సైకిల్‌ని వదిలి.. కారు ఎక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఊపందుకుంది.  చంద్రబాబు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకి మనస్థాపం చెందే మోత్కుపల్లి ఈ నిర్ణయానికి వచ్చినట్లు  తెలుస్తోంది.

ఈ నెలాఖరులో తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యి ఈ విషయంపై చర్చించి, నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

chandrababu and motkuapalli

కాగా, తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని  గత మార్చి నెలలో మోత్కుపల్లి వ్యాఖ్యలతో చంద్రబాబు ఆయనను పార్టీకి దూరంగా పెట్టారు. అలాగే ఆయనకు గవర్నర్‌ పదవీ వస్తుందంటూ గడిచిన మూడేళ్లుగా చెబుతూ వచ్చారు. పదవీ రాకపోవడంతోపాటు పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయం మోత్కుపల్లిలో బాగా పెరిగిపోయిందని టాక్. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

ఇక తాజాగా భువనగిరిలో జరిగిన మినీమహానాడులో కూడా మోత్కుపల్లి పాల్గొనలేదు. ఆయన అనుచరులు మోత్కుపల్లి లేకుండా జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతామని చెప్పారు.

అంతేకాకుండా.. ఇటీవల మోత్కుపల్లి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన టీఆర్ఎస్ లో చేరితే 2019 ఎన్నికల్లో ఆలేరు నియోజకర్గం నుంచి ఆ పార్టీ తరపున మోత్కుపల్లి పోటీ చేయనున్నారని చెబుతున్నారు. అయితే తుంగతుర్తి అసెంబ్లీ లేదా వరంగల్ లోక్ సభ నుంచి ఏదో ఒక చోట పోటీ చేయాలని టీఆర్ఎస్ కోరుతున్నట్టు సమాచారం. ఇక ఇవన్నీ చూస్తుంటే మోత్కుపల్లి పార్టీ మారడం ఖాయమనే అనిపిస్తోంది.

మామాట: ఇక మోత్కుపల్లి టీఆర్ఎస్ నేత అవ్వనున్నారా..?

Leave a Reply