షమీ కెరీర్ ముగిసినట్లేనా..?

Is Mohammad shami cricket career closing
Share Icons:

ఢిల్లీ, 12 జూన్:

గాయాలు వెంటాడుతున్నాయి….ఫామ్ అంతంతమాత్రంగా ఉంది.. ఇక ఇలాంటి సమయంలోనే వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు ఫిటనెస్ టెస్టులోనూ విఫలమయ్యాడు. మొత్తం మీద చూసుకుంటే భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఎటుచూసినా కష్టాలే కనిపిస్తున్నాయి.

భారత క్రికెటర్లకు తప్పనిసరిగా మారిన యోయో ఫిట్నెస్ పరీక్షలో అతను విఫలమయ్యాడు. దీంతో గురువారం అఫానిస్థాన్‌తో ఆరంభమయ్యే ఏకైక టెస్టుకు అతను దూరమయ్యాడు. భారత్ ఆడే ప్రతి సిరీస్ ముందు యోయో టెస్టు నిర్వహిస్తున్నారు. ఇందులో కనీసం 16.1 మార్కులు తెచ్చుకున్నవాళ్లే జట్టులో ఉంటారు. ఆ ప్రమాణాల్ని అందుకోకుంటే వేటు తప్పదు.

kolkata-police-registered-a-case-against-mohammad-shami

ఇక షమీ కూడా ఇక్కడే విఫలమయ్యాడు. 2015 వన్డే ప్రపంచ కప్ తర్వాత మోకాలి గాయంతో దీర్ఘ కాలం ఆటకు దూరమయ్యిన షమీ… గత ఏడాది మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయాడు. అలాగే ఫామ్ కూడా అంతంతమాత్రంగా ఉంది. ఇంతలో అతడి భార్య హసీన్ జహాన్ అతడిపై సంచలన ఆరోపణలు చేసింది. అతడిపై పలు కేసులు కూడా పెట్టింది. ఈ వివాదంలో చిక్కుకుని అల్లాడుతున్న సమయంలో షమీకి యోయో టెస్టు రూపంలో షాక్ తగిలింది.

ఈ పరిస్థితుల్లో షమీ మళ్లీ ఫిట్నెస్ సాధించి ఫామ్ అందుకోవడం కష్టమనే చెప్పాలి. అతడి కెరీర్ దాదాపుగా ముగిసినట్లే అని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.

navdeep saini

షమీ స్థానంలో నవదీప్…

ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్ అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకి దూరం కావడంతో అతని స్థానంలో సెలక్టర్లు ఢిల్లీ యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనిని ఎంచుకున్నారు. అతను భారత టెస్టు జట్టులోకి ఎంపిక కావడం ఇదే తొలిసారి. గత రెండు రంజీ సీజన్లలో సైని చక్కటి ప్రదర్శన చేశాడు.

ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో అతనొకడు. మరోవైపు 23 ఏళ్ల కేరళ వికెట్ కీపర్ బ్యాట్సమన్ సంజు శాంసన్ కూడా ఈ పరీక్ష నెగ్గలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీంతో అతడిని భారత్-ఎ జట్టు నుంచి బీసీసీఐ తప్పించింది. సంజు స్థానంలో మరో యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

మామాట: మూలిగే నక్క మీద తాటి పండు పడటం అంటే ఇదే…

Leave a Reply