మీడియాను ఆడిపోసుకుంటారా? ఎందుకు???

Share Icons:

మీడియాను ఆడిపోసుకుంటారా? ఎందుకు???

ఐదు రోజుల కింద‌ట అతిలోక సుందరి శ్రీ‌దేవి మ‌ర‌ణించింది. ఆమె మ‌ర‌ణవార్త దావాన‌లంలా వ్యాపించింది.

అంద‌రికి బాధ‌. కొంద‌రికి అనుమానం. త‌మ అందాల హీరోయిన్ అక‌స్మాత్తుగా ఎలా చ‌నిపోయింది? అనారోగ్యమా? మరేదైనా కార‌ణ‌మా? ఈ అనుమానం రావ‌డం స‌హ‌జం.

ఆమె అనారోగ్యం పాలైన‌ట్లు అంత‌కుముందు వార్త‌లు వ‌చ్చిఉంటే ఆమె మ‌ర‌ణంపై అంద‌రూ బాధ‌ప‌డేవారు త‌ప్ప కొంద‌రైనా అనుమాన‌ప‌డేవారు కాదు.

అదీ కూడా పెద్ద ప్ర‌మాదం కాదు. బాత్ రూంలో బాత్ ట‌బ్‌లో ప‌డి ఆమె మ‌ర‌ణించిందంటే ఎవ‌రికైనా అనుమానం రావాల్సిందే. మీడియాకు కూడా అలానే అనుమానం వ‌చ్చింది.

అందులో త‌ప్పేం లేదు. శ్రీ‌దేవి మ‌ర‌ణించింది మ‌న దేశంలో కాదు. దుబాయ్‌లో. అక్క‌డ నుంచి స‌మాచారం రావ‌డం లేదు.

అధికారిక స‌మాచారం అంత‌క‌న్నా లేదు. దేశంలో ఉన్న కోట్లాది మంది శ్రీ‌దేవి అభిమానుల‌కు స‌మాచారం చేర‌వేయాల్సిన బాధ్య‌త మీడియాపై ఉంది.

అలా స‌మాచారం ఇవ్వాల్సిన బాధ్య‌త మీడియాకు లేదు- అనే వారికి ఏం చెప్ప‌లేం.

అయితే ఉత్ప‌న్న‌మౌతున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రావాలి. ద‌హ‌న సంస్కారాలు పూర్త‌యినా ఇప్ప‌టికీ అనుమానాలు తీర‌లేదు.

దీనికి బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటారు? మ‌న పోలీసులు తీసుకోలేరు. దుబాయ్ పోలీసుల్ని మ‌నం అడ‌గ‌లేం. మ‌రి ప‌రిస్థితి ఏమిటి?

దుబాయ్ పోలీసుల నుంచి ఫోరెన్సిక్ నివేదిక క్లియరెన్స్ రాగానే శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించారు. అప్ప‌టి వ‌ర‌కూ అందుకు సంబంధించిన వార్త‌ల‌ను మీడియా అందించాలి.

దుబాయ్‌లో ఎవ‌రో ఒక అనామ‌కుడు చ‌నిపోతే ఒక్క సారి వార్త ఇచ్చి వ‌దిలేస్తారు.

ఒక సెల‌బ్రిటీ చ‌నిపోతే.. అందులో కూడా అనుమానాలు ఉంటే మీడియా క‌వ‌ర్ చేయ‌కూడ‌దు అంటే ఎలా?

మేనల్లుడు మోహిత్ మార్వా వివాహానికి బోనీకపూర్‌తో క‌లిసి శ్రీదేవి దుబాయ్‌లోని ‘జువైరా ఎమిరేట్స్ టవర్స్’ హోటల్‌కు వెళ్లింది. రిసెప్షన్ తర్వాత వారు హోటల్‌కు వెళ్లారు.

బోనీకపూర్ తిరిగి భారత్‌కు వచ్చారు. అయితే తిరిగి బోనీ క‌పూర్ ఒక రోజు త‌ర్వాత మ‌ళ్లీ దుబాయ్ చేరుకున్నారు.

దుబాయ్‌కి తిరిగి వస్తున్న సంగతి శ్రీదేవికి బోనీకపూర్ చెప్పలేదు. నేరుగా ఆమె బస చేసిన ‘జువైరా ఎమిరేట్స్ టవర్స్’ హోటల్‌కు వెళ్లారు.

ఆమెను ఆశ్చర్యపరిచిన బోనీకపూర్… నిద్రపోతున్న శ్రీదేవిని సాయంత్రం 5:30 గంటల సమయంలో నిద్రలేపారు. ఎప్పుడొచ్చారు అని ఆశ్చర్చపోయిన శ్రీదేవి దాదాపు ఆయనతో 15 నిమిషాలు మాట్లాడారు.

ఇద్దరు కలిసి డిన్నర్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీదేవి బాత్‌రూంలోకి వెళ్లారు.

దాదాపు పావుగంటైనా ఆమె బాత్ రూం నుంచి బయటకు రాలేదు. దాంతో అనుమానం వచ్చిన బోనీ కపూర్ తలుపుతట్టారు.

లోపల నుంచి మాట వినిపించలేదు. అలకిడి లేదు… స్నానం చేస్తున్న శబ్దం లేదు. దాంతో హోటల్ సిబ్బంది సాయంతో బోనీ కపూర్ తలుపు పగలకొట్టి చూశారు.

బాత్ టబ్‌లో శ్రీదేవి అచేతనంగా పడి ఉండటం కనిపించింది. బోనీకపూర్‌ ఆమెను బతికించుకోవడానికి ప్రయత్నం చేశారని ‘ఖలీజ్ టైమ్స్’ కథనం.

పారామెడికల్ సిబ్బంది రంగంలోకి దిగారు. శ్రీదేవి చనిపోయినట్లు ధృవీకరించారు. ఆమె భౌతికకాయాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

బాత్ టబ్‌లోనే శ్రీదేవి ఊపిరి ఆగిపోయిందని ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు.

శ్రీదేవి శనివారం రాత్రి 11:30 నిమిషాలకు చనిపోలేదని, అంతకు ముందే చనిపోయిందని దుబాయ్ పత్రిక ఖలీజ్ టైమ్స్ కథనం.

అయితే దుబాయ్‌కి శ్రీదేవితో వెళ్లిన బోనీ కపూర్ తిరిగి ముంబైకి ఎందుకు వచ్చారు.

బోనీక‌పూర్ ఎందుకు వెళ్లారు? ఎందుకు వ‌చ్చారు?

శనివారం దుబాయ్ తిరిగి ఎందుకు వెళ్లారు. వెళితే ఆ సాయంత్రం శ్రీదేవితో గడిపారా.. లేక మధ్యలో హోటల్ నుంచి బయటకు వచ్చారా? శ్రీదేవి మృతి గురించి ఆయన ఆలస్యంగా చెప్పారనే సందేహాలు చుట్టుముడుతున్నాయి.

శ్రీదేవి మృతిపై బోనీ కుటుంబంలోని సభ్యులు ఎవరూ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. శ్రీదేవి, బోనీ వివాహం తర్వాత కపూర్ కుటుంబంలో విభేదాలు త‌లెత్తిన మాట వాస్త‌వం కాదా?

ఆ కుటుంబంలో చిన్నవాడైన సంజయ్ కపూర్ మొత్తం కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించార‌ట‌.

శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత బోనీ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్‌ను సంజయ్ ఎక్కువగా చూసుకున్నారు.

అంతేకాదు అటు అనిల్ కపూర్ కుటుంబ సభ్యులతో, ఇటు శ్రీదేవితో కలిసిపోయి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు యత్నించారు. వీటితోపాటుగా ప్రొడక్షన్‌, కోర్టు వ్యవహారాలను సంజయ్ చూసుకునేవారు.

ఇలా కుటుంబ వ్యవహారాలకు పరిమితం కావడంతో సంజయ్ సినీ కెరీర్ దెబ్బతినడానికి కారణమని చెబుతారు.

అలాంటి సంజయ్ కపూర్ కూడా మౌనంగా ఉండడం శ్రీదేవి మృతిపై అనుమానాలు కలగడానికి మరో కారణం.

శ్రీదేవి మరణంపై దుబాయ్‌కు చెందిన ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. శ్రీదేవి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయంటూ పేర్కొంది.

శ్రీదేవి బాత్ టబ్‌లో నిర్జీవంగా పడిపోయారా? స్నానం చేస్తున్నప్పుడే ఆమె గుండె ఆగిపోయి చనిపోయారా? అంటూ పలు ప్రశ్నలను లేవనెత్తింది.

ఈనెల 24వ తేదీ శనివారం రాత్రి హోటల్ గదిలోని బాత్‌ రూంలో స్నానం చేస్తూ ఆమె అచేతనంగా పడి చనిపోయినట్లు ఆ పత్రిక కథనం. ఖ‌లీజ్‌టైమ్స్ ఇండియాకు చెందిన మీడియా కాదే!

మీడియా వ‌ల్లే మ‌న‌శ్శాంతి పోయిందా?

మీడియా వ‌ల్ల త‌మ‌కు మ‌న‌శ్శాంతి దూరం అవుతున్న‌ట్లు శ్రీ‌దేవి కుటుంబం చెబుతున్న‌ది. శ్రీ‌దేవి కుటుంబంలో జ‌రిగిన అన్ని ప‌రిణామాల‌ను మీడియా ఎప్ప‌టిక‌ప్పుడు క‌వ‌ర్ చేయ‌లేదు క‌దా! వాళ్ల మ‌ధ్య ఉన్న విభేదాలు, డ‌బ్బుల్లేక ప‌డ్డ ఇబ్బందులు ఎప్పుడూ రాయ‌లేదు క‌దా?

అక‌స్మాత్తుగా ఒక ముఖ్య‌మైన వ్య‌క్తి అనుమానాస్ప‌ద ప‌రిస్థితుల్లో చ‌నిపోతే కూడా వివ‌రాలు, ప్ర‌శ్న‌లు రాయ‌వ‌ద్ద‌ని అంటే ఎలా?

ఇప్ప‌టికీ క‌మ్ముకుని ఉన్న అనుమానాల‌ను ఎవ‌రూ దూరం చేయ‌డం లేదు. మీడియా రెండు రోజులు రాసి ఊరుకుంటుంది. కానీ శ్రీ‌దేవి మ‌ర‌ణం ప‌ట్ల అనుమానాలు మాత్రం శాశ్వ‌తంగా ఉండిపోతాయి. మీడియా ఓవ‌ర్ చేస్తున్న‌ది అనేది ఇటీవ‌ల చాలా చోట్ల వినిపిస్తున్న మాట‌.

మీడియా ఓవ‌ర్ చేయ‌డం లేదు.

నిజాన్ని దాచిపెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారు అతి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. శ్రీ‌దేవి విష‌యంలో కూడా మీడియా ఇంత హ‌డావుడి చేసింది కాబ‌ట్టే దుబాయ్‌లో క‌నీసం శ‌వ పంచాయతీ అయినా జ‌రిపారు. లేక‌పోతే అదీ జ‌రిగేది కాదు. ఇది గుర్తుంచుకోవాలి.

మీడియా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింద‌ని ఆడిపోసుకుంటుంటారు. ఇదే మీడియా ఇంత ఉత్సాహం చూప‌క పోతే చాలా కేసులు మ‌రుగున ప‌డిపోయేవి.

మీడియా ల‌క్ష్మ‌ణ‌రేఖ దాటింద‌నే విమ‌ర్శ కూడా స‌రికాదు. ఎవ‌రైనా ఆ విధంగా భావిస్తే స‌ద‌రు చానెల్‌పైనో, ప‌త్రిక‌పైనో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

అంతేగానీ గంప‌గుత్త‌గా మీడియా మొత్తానికి ముద్ర వేసి నేరం నుంచి లేదా ఆరోప‌ణ‌ల నుంచి త‌ప్పించుకోవాల‌ని చూడ‌టం క‌రెక్టు కాదు.

English Summery: Everybody criticizing the role of media in Sridevi suspicious death at Dubai. But is it correct to blame the media? This is the question. Media did not entered into  Sridevi’s life and not brought to light about her financial status even though it is in doldrums. Media is not interested in her personal life. This is a suspicious death, so media took interest.  

One Comment on “మీడియాను ఆడిపోసుకుంటారా? ఎందుకు???”

Leave a Reply