గుడివాడలో కొడాలి నానికి తిరుగులేదా…!

Share Icons:

గుడివాడ, 11 ఫిబ్రవరి:

కొడాలి వేంకటేశ్వర రావు(నాని)….రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు…వైఎస్సార్సీపీలో ఫైర్ బ్రాండ్…టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై ఎవరు చేయలేని విధంగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచే వ్యక్తి…

వరుసగా మూడు సార్లు గుడివాడ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి…నాలుగోసారి కూడా గెలిచి సత్తా చాటాలని  చూస్తున్న నేత..పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నేతగా నియోజకవర్గంలో మంచి పేరే ఉంది.

అయితే నాని 2004, 09లో రెండు సార్లు టీడీపీ నుండి, ఒకసారి 2014లో వైసీపీ నుండి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా నిలబడి గెలవాలని చూస్తున్నారు. ఇక అధినేత జగన్ కూడా నానికి మళ్ళీ టికెట్ ఇవ్వడం ఖాయం.

ఇక తాను మూడు సార్లు అధికారంలో లేకపోయిన ప్రజలు సమస్యలని పరిష్కరిస్తున్న నేతగా నానికి పేరుంది. ఈసారి రాష్ట్రంలో వైసీపీ గెలిచి..గుడివాడలో నాని గెలిస్తే మంత్రి అవడం ఖాయమని కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీ ఇమేజ్ కంటే వ్యక్తిగత ఇమేజ్ మీద గెలిచే నేతల్లో నాని ఒకరు.  ఇలాగే  టీడీపీకి కంచుకోటగా ఉండే గుడివాడని తనఇమేజ్‌తో వైసీపీ ఖాతాలో పడేలా చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా నానికి తిరుగుండదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు నానికి ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో…ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు నానికి మద్ధతు ఇచ్చే అవకాశం కూడా ఉంది.

ఇదిలా ఉంటే కంచుకోటని మళ్ళీ దక్కించుకోడానికి టీడీపీ వ్యూహాలు రచిస్తుంది. అందుకు తగ్గట్టుగానే గుడివాడ నియోజకవర్గంలో చాలావరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నానికి ఇమేజ్ ఉన్న ఇక్కడ ముందు నుండి ఉన్న క్యాడర్ టీడీపీ అదనపు బలం.

ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నియూజకవర్గ ఇన్‌చార్జ్ గా ఉన్న రావి వేంకటేశ్వర రావు పోటీ చేస్తారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన రావి ఈసారి గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే రావి ఆర్ధికంగా ఖర్చు పెట్టడంలో ఆలోచిస్తారనే ప్రచారం ఉండటంతో…ఈసారి ఇక్కడ నుండి దివంగత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్  పోటీ చేస్తారని సమాచారం. మరి చూడాలి అధినేత చంద్రబాబు ఎవరికి టికెట్ ఇచ్చి నాని చెక్ పెడతారో…

మామాట: ఈ సారి కూడా నానికి చెక్ పెట్టడం కష్టమే అనుకుంటా…

Leave a Reply