మామాట లో మీమాట పోల్ నెం.14 – ఏది నిజం? ఏది అబద్దం? ఎన్నికల సర్వేలు చెప్పే సత్యాలేంటి?

Share Icons:

ఎన్నికల సర్వేలు పలు మార్లు తారుమారు కావడానికి కారణం ఏమిటి? టీవీలలో ఊదరగొడ్తున్న సర్వేలపై చర్చలకు భిన్నంగా ఫలితాలు వెలువడటానికి కారణం ఏమిటి?

 

[yop_poll id=”23″]

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా పకడ్భందీగా జరుగుతుంది. ఓటరు నాడి కూడా అంతే గోప్యంగా ఉంటుంది. వారి నాడిని పట్టుకోవడానికి ఎన్నో సర్వే సంస్థలు అగచాట్లు పడుతుంటాయి. రకరకాల ఫలితాలను వెల్లడిస్తుంటాయి. అయితే వాటిలో ఏది నిజం? ఏది అబద్ధం? విశ్వసనీయత గలిగిన సంస్థ ఏది? ఇక్కడ పక్షపాత ధోరణి ఉందా? వీటిలో నిజం లేదా? అంటే పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ సర్వే సంస్థలు దిగిపోతాయి. వారి వారి తరహాలో సర్వేలు చేసేసి ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తాయి. ఈ సంస్థలు రెండు రకాలుగా ప్రీపోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహిస్తాయి. మనదేశంలో ప్రధానంగా ఇండియా టుడే-సిసెరో, టైమ్స్ నౌ- సివోటర్, టుడేస్ చాణుక్య, న్యూఎక్స్/సిఎన్ఎక్స్ , దైనిక్ జాగరణ్, ఏబిపి న్యూస్, నీల్సన్  మొదలయిన సంస్థలు సర్వే నిర్వహిస్తుంటాయి. ఈ సర్వే సంస్థలు దేశ వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలను తీసుకుని అక్కడి ఓటరులపై రకరకాల ప్రశ్నలతో ఓటరు మనోగతాన్ని అంచనా వేస్తాయి. ఆ తరువాత వాటిని ఆధారం చేసుకుని ఫలితాలను ప్రకటిస్తాయి.

వీటిలో పారదర్శకత ఎంత?

సర్వే అంటే అది నిజమైన సర్వే అయితే సంస్థలకు సంస్థలకు మధ్యన పెద్ద వ్యత్యాసం ఉండదు. ఫలితాలలో చాలా తక్కువ తేడా ఉంటుంది. కానీ, ఇక్కడ సర్వే నిర్వహించే సంస్థల మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు కొన్ని సంస్థలు కొన్ని కూటములను నెత్తిన వేసుకుని సర్వే ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఇందుకు బీహార్ రాష్ట్ర ఎన్నికలను ఉదాహరణగా చెప్పవచ్చు. ఇందులో టుడేస్ చాణుక్య, దైనిక్ జాగరణ్, నీల్సన్ ఏబిపి న్యూస్, ఇండియా టుడే సిసెరో వంటి సంస్థలు బీజేపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పాయి. ఇక టుడే చాణుక్య అయితే ఏకంగా 155 స్థానాలు వస్తాయని చెప్పింది. ఒక్క టైమ్స్ నౌ, న్యూస్ నేషన్ మాత్రమే స్వల్ప మెజారిటీతో జెడి(యు) అధికారంలోకి వస్తుందని చెప్పాయి. నితీష్ కుమార్ నేతృత్వంలో ఆర్జేడితో సహా అన్ని పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ రెండు సంస్థలు తెలిపాయి. ఏమయ్యింది. ఇక్కడ భారతీయ జనతాపార్టీ 130 స్థానాలు వస్తాయని సర్వే సంస్థలు లెక్కగడితే 53 స్థానాలకు పరిమితం అయ్యింది. ఎక్కడ 130 స్థానాలు ఎక్కడ 53 స్థానాలు. ఏమిటీ సర్వేలకు ప్రామాణికం? ఎందుకు ఇలా జరుగుతోంది.? పోనీ టైమ్స్ నౌ, న్యూస్ నేషన్ చెప్పింది ఏమైనా నిజమయ్యిందా? అంటే అదీ లేదు. బీజేపీకి 117 సీట్లు వస్తాయని తెలిపాయి. ఏమయ్యింది? వీరి అంచనాలు కూడా తారుమారయ్యాయి. సర్వే సంస్థల దృష్టి లోపమా? లేక పక్షపాతమా? ఈ సర్వేలకు విశ్వసనీయత ఎంత?

తాజాగా కర్ణాటక సర్వేలు ఏమి చెప్పాయి?

కర్ణాటక ఎన్నికలు ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు భారతీయ జనతాపార్టీకి ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. ఇక్కడ కూడ సర్వే సంస్థలు అరుదెంచాయి. ఇండియా టుడే, యాక్సీస్ టైమ్స్ నౌ వీఎంఆర్ వంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. భారతీయ జనతాపార్టీని 70 నుంచి 90 సీట్లకు పరిమితం చేసేశాయి. కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా 110 దరిదాపులలో ఉంటాయని చెప్పాయి. ఏం జరుగుతోంది. వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే ఈ సర్వేలన్నీ పచ్చి అబద్దాలని తేలిపోయాయి. అంటే ఇంతవరకూ పేరుమోసిన సంస్థలు చేసిన సర్వేలన్నీ గాలి వాటం సర్వేలేనని మరోమారు స్పష్టమౌంతోంది. దేశంలో మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత అంశాన్ని పట్టుకుని సర్వే నిర్వహించినట్లుంది. భారత దేశంలో జాతీయతను వేరుగా చూస్తారు. ప్రాంతీయతను వేరుగా చూస్తారనే మౌళిక అంశాన్ని సర్వే సంస్థలు  అంచనా వేయలేకపోయాయి. ఇక్కడ ప్రాంతీయ అంశాల/సమస్యల ప్రభావం స్పష్టంగా ఉంటుందనే విషయాన్ని కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయాయనే చెప్పాలి. వీటిని ఎలా నమ్మాలి?

మామాట : సాగిలాపడే సంస్థలు… మొక్కుబడి సర్వేలు… సందిగ్ధంలో ప్రజలు..

3 Comments on “మామాట లో మీమాట పోల్ నెం.14 – ఏది నిజం? ఏది అబద్దం? ఎన్నికల సర్వేలు చెప్పే సత్యాలేంటి?”

Leave a Reply