కర్నూలుకు హైకోర్టు తరలించడం సులువేనా?

high-court-issue-6-districts-lawyers-oppose-high-court-in-kurnool
Share Icons:

అమరావతి: ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరిరోజున ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టొచ్చని సూచన చేసిన విషయం తెలిసిందే. అమరావతిలో లెజిస్లేటివ్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్, కర్నూలులో జ్యూడిషయల్ క్యాపిటల్స్ ఏర్పాటు చేయొచ్చని చెప్పారు. ఇక అక్కడ నుంచి ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులని ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే దీనిపై పలు రకాల కమిటీలని కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా జి‌ఎన్ రావు, బోస్టన్ కమిటీలు కూడా మూడు రాజధానుల అంశాన్ని సమర్ధించాయి. ఇక ప్రభుత్వం తుది నిర్ణయం కూడా ఇదే ఉంటుందని తేలిపోయింది.

ఈ క్రమంలోనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ఖాయమని తేలింది. అయితే ప్రస్తుతం అమరావతిలో హైకోర్టు ఏర్పాటు అయి ఉంది. అవ్వడానికి తాత్కాలికం అని పేరు ఉన్న…అది సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటు అయింది. ఇలాంటి తరుణంలో కర్నూలుకు హైకోర్టు ఏర్పాటు చేయడం సులువేనా అంటే? కష్టమే అని తెలుస్తోంది. ఎందుకంటే హైకోర్టు తరలింపుకు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు, సవాళ్లు చాలా ఉన్నాయి. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్‌ 31(2) ప్రకారం సుప్రీంకోర్టు…హైకోర్టును అమరావతిలో ఏర్పాటుచేసింది. హైకోర్టును కర్నూలుకు తరలించాలంటే, ముందు ఈ నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్తది జారీ చెయ్యాలి. కానీ ఇలా చెయ్యకూడదని సెక్షన్‌ 31 సూచిస్తోంది.

మామూలుగా అమరావతిలో హైకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైంది. అప్పట్లో… తెలంగాణ నుంచీ ఏపీకి వెళ్లిన జడ్జిలు వివిధ స్థలాల్ని అమరావతిలో ఓ ప్రాంతాన్ని హైకోర్టు ఏర్పాటుకు ఎంపిక చేసుకున్నారు. దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. 2018 డిసెంబర్‌ 26న అమరావతిలో హైకోర్టును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2019 జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు పని ప్రారంభించింది.

ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టును తరలించే అధికారు సుప్రీంకోర్టుకు లేదు. డివిజన్ బెంచ్‌లు మాత్రమే ఏర్పాటు చెయ్యగలదు. కాకపోతే హైకోర్టును అమరావతి నుంచి తరలించే నోటిఫికేషన్‌ జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. అయితే ఇక్కడ తేలాల్సిన విషయం ఏమిటంటే? సెక్షన్‌ 31(2) ప్రకారం రాష్ట్రపతి ఇచ్చిన నోటిఫికేషన్‌ను రీ–నోటిఫై చెయ్యొచ్చా? లేక డివిజనల్‌ బెంచ్‌లు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. ఇక మొత్తం మీద చూసుకుంటే కర్నూలుకు హైకోర్టు తరలించవచ్చు గానీ అది అంత సులువైన పని మాత్రం కాదనిపిస్తుంది. తరలింపుకు న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేయడానికి ఎక్కువ సమయం అయ్యేలా కనిపిస్తుంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందో చూడాలి.

 

Leave a Reply