TRENDING NOW

గుడ్డుకి డయాబెటిస్‌కి సంబంధం ఏమిటి…?

గుడ్డుకి డయాబెటిస్‌కి సంబంధం ఏమిటి…?

హైదరాబాద్, 5 ఫిబ్రవరి:

మారుతున్నజీవనశైలి, ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి వలన వయసుతో సంబంధం లేకుండా…మనదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు డయాబెటిస్(షుగర్)వ్యాధికి గురవతున్నారు. డయాబెటిస్‌ రక్తంలోని చక్కెర స్థాయిలు అధికం కావడం వల్ల వస్తుంది.

ఇక ఈ వ్యాధిని తగ్గించుకోవడం కోసం వైద్యుల సలహాతో మందులు, ప్రత్యేకమైన డైట్ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ డైట్‌లో గుడ్డును చేర్చడం వలన షుగర్ తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా రోజుకో కోడి గుడ్డు తింటే మనిషికి పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. కానీ గుడ్డుని తినడం వలన డ‌యాబెటిస్ వచ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

రోజు ఒక కోడిగుడ్డును తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా మాలిక్యులార్ న్యూట్రిష‌న్ అండ్ ఫుడ్ రీసెర్చి జర్నల్‌లో వచ్చిన అధ్యయనం ప్రకారం శాస్త్రవేత్తలు 239 మంది వ్య‌క్తుల‌ను 20 ఏళ్ల పాటు ప‌రిశీలించారు. ఇందులో రోజుకో గుడ్డు తినేవారిలో డయాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని తెలిసింది. ఇక గుడ్డు తిన‌ని వారికి డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని తేల్చేశారు. గుడ్డులో ఉండే జీవ ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు డ‌యాబెటిస్ రాకుండా చూస్తాయ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదండి మేటర్ కాబట్టి రోజుకోగుడ్డు తిని షుగర్ వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోండి.

మామాట: గుడ్డు అన్ని విధాలా మంచిది అనమాట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: