వివాదాల ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తాడా…

Share Icons:

ఏలూరు, 13 మార్చి: 

రాష్ట్రంలో ఎక్కువ వివాదాల్లో ఉన్న ఎమ్మెల్యే ఎవరు అంటే..అందరూ ఠక్కున దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెబుతారు. నిత్యం ఏదొక వివాదంలో చిక్కుకుని ఆయన వార్తల్లోనే ఉంటాడు. అయితే ఎన్ని వివాదాలు ఉన్న ఆయన మాత్రం దెందులూరు నుండి గెలుస్తూనే ఉన్నాడు. ఇక ఈ ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ నుండి బరిలోకి దిగుతున్నాడు.  నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ది కార్యక్రమాల తీరు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించే ఎమ్మెల్యేగా చింతమనేనికి పేరుంది. అయితే 2014లో టీడీపీలో అధికారం వచ్చాక ఆయన చుట్టు వివాదాలు చక్కర్లు ఎక్కువ కొడుతున్నాయి. ఇసుక వివాదంలో ఎం‌ఆర్‌ఓ తో గొడవ దగ్గర నుండి బస్సు మీద చంద్రబాబు ఫోటో లేకపోవడంతో డ్రైవర్‌ని , కండక్టర్‌ని బెదిరించడం వరకు చాలానే వివాదాలు చింతమనేని చుట్టూ ఉన్నాయి. అలాగే తాజాగా దళితులపై చేసిన వ్యాఖ్యలు చింతమనేనికి మైనస్ కానున్నాయి.

దెందులూరులో వైసీపీ విషయానికొస్తే ఎమ్మెల్యే అభ్యర్ధిగా అబ్యయ్య చౌదరి బరిలో దిగబోతున్నారు. చింతమనేనిపై పోటిచేయబోతున్న అబ్యయ్యచౌదరి ఆ పార్టీకి కొత్తే అయినా గ్రామలవారిగా నాయకుల్లో,కార్యకర్తల్లో గెలుపుపై నమ్మకం కుదిరేలా మీటింగులు ఏర్పాటు చేసుకుంటూ పోతున్నారు. కమ్మసామాజికి వర్గానికే చెందిన వ్యక్తికావడంతో వచ్చే ఎన్నికల్లో చింతమనేనికు పోటి ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు.

అటు జనసేన విషయానికొస్తే ఆ పార్టీ తరుపున బలమైన అభ్యర్ధిని పోటిలో దించినా టీడీపీ, వైసీపీలని ఓడించడం కష్టమైన పనే. పైగా టీడీపీ, వైసీపీలకి గ్రామ గ్రామానా పోలింగ్ బూత్ స్థాయి క్యాడర్ చాలా బలంగా పనిచేస్తుంది. అటువంటి సమయంలో జనసేన పోటిచేసినా ఆస్థాయి నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. ఏది ఏమైన వచ్చే ఎన్నికల్లో టీడీపీ-వైసీపీల మధ్యప్రధాన పోరు  జరగబోతోంది.

మామాట: మరి దెందులూరు ప్రజలు ఈసారి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో

Leave a Reply