చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ పై దుష్ప్రచారం చేయించారా?

is chandrababu Propaganda on junior ntr on social media
Share Icons:

అమరావతి: గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై మండిపడ్డారు. అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ పై ఫైర్ అయ్యారు.  తమను ఎంతగా అణగదొక్కాలని చూస్తే అంత రెచ్చిపోతామనే విషయాన్ని గుర్తించాలన్నారు. జగన్ సర్కార్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. సోషల్ మీడియా పోస్టులను చూపి అరెస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

అయితే చంద్రబాబు విమర్శలపై వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఓ సంచలన విషయం చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయించింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం, టీడీపీ ఎమ్మెల్యే, సినీ హిరో నందమూరి బాలకృష్ణ ఆఫీస్ నుంచి వైసీపీపై తప్పుడు పోస్టులు చేయిస్తున్నారని చెప్పారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని మాట్లాడారు. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కూడా చంద్రబాబు, ఆయన పార్టీలోని కొందరు నేతలు వదల్లేదని. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ పై దుష్ప్రచారం చేశారని చెప్పారు. చంద్రబాబుపై ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, మానసిక వైకల్యంతో బాధపడుతున్న చంద్రబాబును వెంటనే ఆస్పత్రిలో చేర్పించి సరైన చికిత్స అందించాలని అన్నారు.

ఇక మహిళలు వినలేని మాటలను చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఆయన మీడియాతో మాట్లాడిన తీరును సొంత పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని సుధాకర్ తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టును జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ముడిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. మొత్తం మీద అయితే చంద్రబాబు చేసిన విమర్శలకు రివర్స్ కౌంటర్లు వచ్చాయి. అయితే ఒకానొక సమయంలో కొందరు టీడీపీ నేతలు కూడా ఎన్టీఆర్ పై దుష్ప్రచారం చేశారు. పనిగట్టుకుని ఆయన సినిమాల విడుదల సమయంలో సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేశారు. దాని వల్ల ఎన్టీఆర్ సినిమాలు కొన్ని ఫ్లాప్ కూడా అయ్యాయి.

 

Leave a Reply