భయ్యూజీ మహరాజ్‌ది ఆత్మహత్యేనా..? కారణమేంటి?

Share Icons:

ఇండోర్, జూన్ 13:

ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్‌ ఆత్మహత్యేనా…? కారణమేంటి?ఆయన ఎందకు అంత ఆందోళనగా ఉన్నారు. ఆయన మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఏం జరిగింది? వివరాలిలా ఉన్నాయి.

మంగళవారం తుపాకితో తనను తాను కాల్చుకుని భయ్యూజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక వత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖ ఆయన గదిలో లభించింది. కానీ తాజాగా ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్య చేసుకునే కొన్ని గంటల ముందు ఆయన ఒక రెస్టారెంటుకు వెళ్లినట్లు సీసీటీవీ పుటేజ్‌ ద్వారా బయటపడింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహరాజ్ మంగళవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకు మునుపు ఆయన రెస్టారెంటులో కొంత ఆందోళనగా కనిపించినట్లు అర్థమవుతోంది. సీసీ ఫుటేజీని పరిశీలించినప్పుడు అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెస్టారెంట్‌లోకి ప్రవేశిస్తునే ఫోన్లో ఎవరితోనో సంభాషిస్తున్నారు. కొంతసేపటికి ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు.

టెబుల్ వద్ద కూర్చుని ఉండగానే ఆయన రెండో భార్య డాక్టర్‌ ఆయుష్‌ శర్మ అక్కడికి వచ్చి భయ్యూజీతో చర్చించారు. అంతలోనే భయ్యూజీ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన ఒకింత ఆదోళనగా, గాబరాపడుతున్నట్లు కనిపించారు. ఆ మేరకే సూసైడ్‌ నోట్‌లో మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొన్నారు. ఆయన ఆ మాట చెప్పినప్పటికీ, అసలు కారణం వేరే ఉన్నట్లు అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.

కుటుంబ కలహాలే కారణమా?

భయ్యూజీ ఆత్మహత్య వెనుక కుటుంబ కలహాలు కారణం కావచ్చుననే కోణం కూడా కనిపిస్తోంది. పరస్పర ఆరోపణలు అలాగే అనిపిస్తున్నాయి. ఆస్తి విషయంలో మొదటి భార్య మాధవికి, రెండో భార్య ఆయుషీ శర్మకు విభేదాలు ఉన్నాయి. తన తండ్రి మరణానికి ఆయుషీ శర్మనే కారణమని, మొదటి భార్య కూతురు కుహు ఆరోపిస్తోంది. ఇది ఉండగా కుహుపై రెండో భార్య ఆయుషీ ఆరోపణలు గుప్పిస్తోంది. కుహు వ్యవహారశైలి బాగోలేదని, ఆమె తమను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. భయ్యూజీ ఆత్మహత్యకు కుహునే కారణమని ఆయుషీ ప్రత్యారోపణలు చేశారు. మొత్తంపై ఇద్దరి మధ్యన పెద్ద ఎత్తున కలహాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ రెండింటి కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? అనే అనుమానం కూడా కలుగుతోందన్నారు.

రాజకీయాలు కారణమా?

ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ ఆత్మహత్యను కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. భయ్యూజీ ఆత్మహత్యకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. భయ్యూజీని రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు సాగించిందని ఆరోపించారు. వేల సంఖ్యలో ఆయనకున్న అభిమానులు, భక్తులు ఉన్నారని బీజేపీ ఆయన తమవైపు తిప్పుకోవడానికి మంత్రి పదవితో ఎర వేసిందని, తీవ్ర ఒత్తిడి చేసిందని అన్నారు. ఆయన ఆత్మహత్యకు ఇదే కారణమయ్యిందని కాంగ్రెస్ ఆరోపించింది.

మామాట : మొత్తానికి ఒత్తిడే భయ్యూజీ ఆత్మహత్యకు కారణమయ్యింది.

Leave a Reply