పిజ్జాలో నట్లు, బోల్టులు! తస్మాత్ జాగ్రత!

Share Icons:

ఇంగ్లాండ్‌ లోని లాంకషేర్‌ రాష్ట్రం థార్టన్‌ క్లెవెలెస్‌ జంట నగరాలకు చెందిన ఓ మహిళ గతనెల 29వ తేదీన డోమినోస్‌లో పిజ్జా ఆర్డర్‌ చేసింది. ఇంటికి చేరిన పిజ్జాను తీసుకుని తింటుండగ ఇనుప నట్లు, బోట్లు కనిపించాయి. ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురయ్యింది. వాటిని ఫొటో తీసి పెట్టుకుని డోమినోస్‌కు ఫిర్యాదు చేసింది. నట్లు, బోట్లు రావడంపై సంస్థ క్షమాపణ చెప్పింది. తన డబ్బులు చెల్లించమని అడగడంతో సంస్థ తిరిగి ఇచ్చేసింది. అయితే అంతకుముందే ఆమె ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్లలో షేర్‌ చేసింది.

‘తినడానికి ముందు మీ పిజ్జాలను ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా థోర్టన్‌ క్లెవ్‌లీస్‌లోని డొమినోస్‌ నుంచి పిజ్జా ఆర్డర్‌ పెట్టేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని ఆమె సూచించింది.

ఇది తెలుసుకున్న వెంటనే డొమినోస్ దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ‘అసౌకర్యానికి క్షమాపణలు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు స్టోర్‌తో మాట్లాడాం. డొమినోస్‌ వినియోగదారుడి సంతృప్తి, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి. ఇకపై ఇవి కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply