కేరళ అందాలు చూసొద్దామా!

Share Icons:

కొచ్చి, జూలై 31,   ఈ రుతువులో విరిసే కేరళ అందాలు గురించి మాటల్లో చెప్పడం కష్టమే. ఆ అద్భుత ప్రపంచాన్ని కనులారా వీక్షిస్తేనే అసలు మజా! పచ్చని కొండలు, కొబ్బరి తోటలు, నీటి పాయలు, జలపాతాలు.. ఒకటేమిటీ ఇంకా ఎన్నో అందాలు. వాటిని చూసి ఆనందించడానికి పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక పథకం ప్రకటించింది.

కేరళాలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను ఆరు రోజులపాటు సందర్శించేందుకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీ ప్రకారం.. ఆరు రోజులు, ఐదు రాత్రులకు రూ.23,700 (ముగ్గురు షేర్ చేసుకోవాలి) చెల్లించాలి. సెప్టెంబరు 18 నుంచి 21 మధ్య ఏదైనా ఒక తేదీలో ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ కింద కొచిన్, మున్నార్, తెక్కడే, అలెప్పీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు.

ఢిల్లీ నుంచి కోచికి స్పైస్‌జెట్ విమానం ద్వారా కేరళాకు చేరేలా ఈ ప్యాకేజీ రూపొందించారు. విమాన టికెట్లు, కేరళలోని హోటల్ తదితర ఛార్జీలన్నీ ఈ ప్యాకేజీలో చేర్చారు.

ఎలాంటి షేరింగ్ లేకుండా ఒంటరిగానే ఈ ప్యాకేజీ పొందాలంటే రూ.35,000 చెల్లించాలి.

ఇద్దరితో షేరింగ్‌కు రూ.25,100, ముగ్గురితో రూ.23,700 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తోపాటు ప్యాకేజీ కావాలంటే..

అదనంగా రూ.19,400, బెడ్ లేకుండా రూ.16000 చెల్లించాలి. 2 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులకైతే రూ.12,700 చెల్లించాలి.

మామాట: దేవుని స్వంతభూమిలో తిరిగిరావడం మజా ఇస్తుంది. 

Leave a Reply