అమెరికా వర్సెస్ ఇరాన్….

Amercia vs Iran
Share Icons:

వాషింగ్టన్, 23 జూలై:

అమెరికా, ఇరాన్ దేశ అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విట్టర్‌లో ఇరువురి నాయకులు ఒకరికొకరు వార్నింగ్‌లు ఇచ్చుకుంటున్నారు. పులితో ఆటలు వద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే అంత సులువైనది ​కాదని నిన్న ఇరాన్ అధ్యక్షుడు హసన్‌ రోహనీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వార్నింగ్‌ ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే హసన్‌ వ్యాఖ్యలపై ట్రంప్‌ ‍స్పందిస్తూ.. అమెరికాను బెదిరించాలని చూడకండని, మీరు బెదిరిస్తే భయపడే దేశం మాది కాదని గట్టిగా హెచ్చరించారు. ఇక అమెరికా ఎప్పటికి, ఎవరికి బయపడదని, తమ జోలికి వస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామలు చూడాల్సి వస్తుందని, అమెరికాతో జాగ్రత్తగా వ్యవహరించండి అంటూ ట్రంప్‌ ఘాటుగా ట్వీట్‌ చేశారు.

కాగా, 2015లో ఇరాన్‌ ఉగ్రవాదుల ముఠాకు సహకరిస్తోందన్న ఆరోపణలతో ఆదేశ న్యూక్లియర్‌ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించి, రాజకీయంగా ఒత్తిడి తేచ్చేందుకు ‍ప్రయత్నిస్తోంది.

మామాట: వీరి మాటల యుద్ధం చివరికి ఏ స్థాయికి చేరుతుందో?

Leave a Reply