ఐక్యూ 3 5జీ స్మార్ట్‌ఫోన్‌…బెస్ట్ ఫీచర్స్….

IQOO3 5G smartphone
Share Icons:

ముంబై: ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు ఐక్యూ.. ఐక్యూ 3పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది.  ఈ ఫోన్‌ 5జి వేరియెంట్‌లోనూ లభిస్తున్నది. ఐక్యూ 3 4జీ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.36,990 ఉండగా, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.39,990గా ఉంది. అలాగే 5జి 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.44,990గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఐక్యూ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో విక్రయించనున్నారు. ఈ సందర్భంగా ఐసీఐసీఐ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.3వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే నో కాస్ట్‌ ఈఎంఐ విధానంలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌ బ్యాక్‌ కేస్‌కు గొరిల్లా గ్లాస్‌ 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన 4440 ఎంఏహెచ్‌ బ్యాటరీకి 55 వాట్ల ఫ్లాష్‌ చార్జ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్‌ను కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే 0 నుంచి 50 శాతం వరకు చార్జింగ్‌ చేసుకోవచ్చు.

ఐక్యూ 3 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు…

6.44 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

2400 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

2.84 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌

8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్‌ 10, డ్యుయల్‌ సిమ్‌

48, 13, 13, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 5జి/4జి

బ్లూటూత్‌ 5.1, యూఎస్‌బీ టైప్‌ సి

4440 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సూపర్‌ ఫ్లాష్‌ చార్జ్‌

ఎల్‌జీ క్యూ51

దిగ్గజ ఎల్‌జీ కంపెనీ క్యూ51 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.18,820 ధరకు ఈ ఫోన్‌ త్వరలో వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌ విజన్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్‌ మెయిన్‌ కెమెరా, 5 మెగాపిక్సల్‌ అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 2 మెగాపిక్సల్‌ డెప్త్‌ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు భాగంలో 13 మెగాపిక్సల్‌ కెమెరాను ఏర్పాటు చేశారు.

ఎల్‌జీ క్యూ51 ఫీచర్లు…

6.5 ఇంచ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 720 x 1560 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

2 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి22 ప్రాసెసర్‌

3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 2టీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్‌ 9.0 పై, 13, 5, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

13 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, ఎన్‌ఎఫ్‌సీ

యూఎస్‌బీ టైప్‌ సి, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

 

Leave a Reply