సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో అనూహ్యంగా స్టాయినిస్‌ని ఓపెనర్‌గా తెరపైకి తెచ్చి ఆడించగా.. అతను హిట్టింగ్తో ఆరంభంలోనే ఢిల్లీని తిరుగులేని స్థితిలో నిలిపాడు. మూడో ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టిన స్టాయినిస్ (38: 27 బంతుల్లో 5×4, 1×6) తొలి వికెట్‌కి ధావన్‌తో కలిసి 8.2 ఓవర్లలోనే 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓపెనింగ్ జోడీలో ఈ మార్పునకి కారణం టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉచిత సలహానేనట. ఈ విషయాన్ని సెహ్వాగ్ స్వయంగా వెల్లడించాడు.
‘‘హైదరాబాద్‌పై క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతకంటే.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మార్కస్ స్టాయిన్ ఓపెనర్‌గా రావడం మరీనూ. నేను ఢిల్లీకి గతంలోనే చెప్పాను స్టాయినిస్‌ని ఓపెనర్‌గా ఆడించమని. మొత్తానికి నా ఉచిత సలహా ఢిల్లీకి కలిసొచ్చింది’’ అని సెహ్వాగ్ వెల్లడించాడు. హైదరాబాద్‌పై 17 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కి చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈరోజు ముంబయి ఇండియన్స్‌తో తుది పోరులో ఢీకొట్టబోతోంది. ఫైనల్లోనూ స్టాయినిస్ ఓపెనర్‌గా రావడం లాంఛనమే..!