ఇండియాలోనే ఉత్పత్తి అవ్వనున్న ఐఫోన్ ఎక్స్‌ఆర్…రేట్లు తగ్గింపు

iPhone XR Now Being Assembled in India for Domestic Market
Share Icons:

ముంబై: అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఆపిల్ సంస్థకు చేసిన ఐఫోన్ ఎక్స్‌ఆర్ స్మార్ట్ ఫోన్ ఇక నుంచి ఇండియాలో ఉత్పత్తి కానుంది. ఇప్ప‌టికే చెన్నై స‌మీపంలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంట్ లో ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫోన్ల ఉత్ప‌త్తి ప్రారంభం కాగా ప్ర‌స్తుతం మేడిన్ ఇన్ ఇండియా ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫోన్లు మార్కెట్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కాగా ఈ ఫోన్ ఇక భార‌త్‌లోనే ఉత్ప‌త్తి అవుతుండ‌డంతో ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర త‌గ్గింది.

ఈ క్ర‌మంలో ఈ ఫోన్‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కే వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫోన్‌కు చెందిన 64జీబీ వేరియెంట్ ధ‌ర ప్ర‌స్తుతం రిటెయిల్ మార్కెట్‌లో రూ.49,900 ఉండ‌గా, ఆన్‌లైన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో దీపావ‌ళి సేల్స్‌ సంద‌ర్భంగా ఈ వేరియెంట్‌ను రూ.44,900 కే విక్ర‌యిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌కు చెందిన మిగిలిన వేరియెంట్ల ధ‌ర‌లు కూడా త‌గ్గాయి.

ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్‌లో వినియోగ‌దారులు చాలా త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 7ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. సేల్‌లో భాగంగా ఐఫోన్ 7కు చెందిన 32 జీబీ వేరియెంట్ రూ.26,999 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, ఎస్‌బీఐ ఆఫ‌ర్‌తో వినియోగ‌దారులు ఈ వేరియెంట్‌పై రూ.1750 వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఈ ఫోన్‌ను రూ.25,250కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

25 వరకు కొనసాగానున్న షియోమీ దివాలీ విత్ ఎంఐ సేల్‌లో రెడ్‌మీ నోట్ 7 ప్రొ, రెడ్‌మీ కె20 ప్రొ, కె20, పోకో ఎఫ్1, రెడ్‌మీ వై3, ఎంఐ టీవీ 4ఎ ప్రొ (43 ఇంచ్), ఎంఐ టీవీ 4సీ ప్రొ (32 ఇంచ్), ఎంఐ సూపర్ బేస్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, ఎంఐ హోం సెక్యూరిటీ కెమెరా బేసిక్, ఎంఐ హోం సెక్యూరిటీ కెమెరా 360 తదితర డివైస్‌లపై రాయితీలను అందిస్తున్నారు.

షియోమీ.. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2సి

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2సి పేరిట ఓ నూతన ఎయిర్ ప్యూరిఫైర్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. దీన్ని ఎంఐ హోం యాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఇంట్లో గాలి నాణ్యతను పెంచుకోవచ్చు. అలాగే టెంపరేచర్, హ్యుమిడిటీ, ఫ్యాన్ స్ట్రెంగ్త్ కంట్రోల్ చేయవచ్చు. ఈ ప్యూరిఫైర్ గాలిలో ఉండే దాదాపు అన్ని రకాల సూక్ష్మ క్రిములను, ధూళి కణాలను దాదాపుగా 99.37 శాతం వరకు తొలగిస్తుంది. అందుకు గాను ఈ డివైస్‌లో 360 డిగ్రీల కోణంలో తిరిగే నూతన ఫిల్టర్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్యూరిఫైర్ ధర రూ.6499 ఉండగా దీన్ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్, హోం స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.

 

Leave a Reply