ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్…!

iPhone 11 With Dual Rear Cameras, Apple A13 Bionic SoC, Liquid Retina Display Launched
Share Icons:

ముంబై:

మొబైల్స్ రంగంలో అగ్రగామిగా దూసుకెళుతున్న యాపిల్ సంస్థ అదిరిపోయే ఫీచర్లు గల ఐఫోన్ 11 సిరీస్ లో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లని విడుదల చేసింది. ఐఫోన్‌ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌ పేరిట వీటిని విడుదల చేశారు. ఐఫోన్‌ 11 64 జీబీ ధర 699 డాలర్ల నుంచి  మొదలవుతుంది. ఇక ఐఫోన్ 11 ప్రో– 128 జీబీ ధర 999 డాలర్ల నుంచి ,ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ 128 జీబీ ధర 1099 డాలర్ల నుంచి మొదలవుతుంది. ఇండియలో వీటి ధర ఇంకా తెలియదు. అయితే వీటికి 2019 సెప్టెంబరు 13 నుంచి ముందస్తుగా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. మూడు ఐఫోన్ 11 మోడల్స్ సెప్టెంబర్ 20 నుంచి పేటీఎం మాల్లో  లభ్యం కానున్నాయి. పేటీఎం మాల్ 2019 ఐఫోన్ మూడు మోడల్స్ పై రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది.

ఇక ఐఫోన్‌ 11 ఆరు రంగుల్లో లభ్యం కానున్నది. కొత్తగా గ్రీన్, పర్పుల్‌ రెడ్, యెల్లో రంగుల్లో లభించనున్నది.  స్పెషల్‌ ఆడియో, డాల్బీ అట్మోస్‌ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 6.1 లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లే, స్లో మోషన్‌ సెల్ఫీలు, ఏ13 బయోనిక్‌ చిప్‌ వంటి ప్రత్యేకతలున్నాయి. అలాగే  4జీబీ ర్యామ్‌తోపాటు 64/256/512 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ లో 3110 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో డ్యుయల్ సిమ్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ లని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

అటు ఐఫోన్ 11 ప్రొలో 5.8 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా, 11 ప్రొ మ్యాక్స్‌లో 6.5 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వీటిల్లో 6జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లు 128/256/512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఈ ఫోన్ల వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మూడు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి టెలిఫోటో, వైడ్, అల్ట్రావైడ్ సామర్ధ్యాన్ని కలిగిఉన్నాయి. ఇక ఐఫోన్ 11 ప్రొలో 3190 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా, 11 ప్రొ మ్యాక్స్‌లో 3500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన ఫీచర్లన్నీ ఐఫోన్ 11లోనివే వీటిల్లోనూ ఉన్నాయి.

Leave a Reply