ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు…

IOCL Recruitment 2019 mutltiple positions
Share Icons:

హైదరాబాద్:

 

ఖాళీలు ఉన్న టెక్నికల్, నాన్-టెక్నికల్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-ఐ‌ఓ‌సి‌ఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చెరీలో మొత్తం 413 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

 

ఇక తెలంగాణలో 36, ఆంధ్రప్రదేశ్‌లో 36 పోస్టులున్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, అకౌంటెంట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆగస్ట్ 7 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

 

మొత్తం ఖాళీలు- 413

 

దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 17

 

దరఖాస్తు ముగింపు: 2019 ఆగస్ట్ 7

 

విద్యార్హత: ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల ఫుల్‌టైమ్ ఐటీఐ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ కావాలి. నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు 50% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి.

 

పూర్తి వివరాలకు

 

వెబ్ సైట్: https://www.iocl.com/PeopleCareers/job.aspx

Leave a Reply