నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం

Share Icons:

జూన్21 వ తేదీని గత నాలుగు సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగ దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  శరీర అంతర్-బహ్య ఆరోగ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున యోగ సాధన కొనసాగిస్తుంది. అనేక బృందాలు ప్రదర్శన నిర్వహిస్తాయి.  యోగ సాధన వలన సమకూరే మంచి ఫలితాలను విశ్వవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడమే యోగ దినోత్సవం ప్రత్యేకత. యోగ ద్వారా శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత సమకూరుతుంది.  యోజ అనే సంసకృత పదం నుంచి యోగ అనే మాట పుట్టింది. యోజ అంటే.. కలవడం,  కూడడం అని అర్థం. ఇది శరీరము ఆత్మల కలయికకు నిదర్శనంగా భావిస్తారు.

కాాగా 2018 యోగ దినోత్సవానికి  శాంతి కొరకు యోగ అన్నది థీమ్ గా నిర్ణయించారు. కాగా 2015 జూన్ 21 న నిర్వహించిన తొలి యోగ దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు, ఆ ప్రదర్శనలో 84 దేశాల ప్రముఖులతో పాటు 35,985 యోగ సాధకులు కూడా పాల్గొనడం విశేషం.  కొత్త ఢిల్లీ రాజ్ పథ్ లో జరిగిన ఈ వేడుకలో వీరు 35 నిమిషాలపాటు 21 యోగాసనాలు ప్రదర్శించారు. ఇక ఈ రోజు  డెహ్ర డూనే లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోది సహా 60 వేల మంది పాల్గొననున్నారు. యోగ గురువు రాందేవ్ బాబా, జగ్గీవాసుదేవ్ తదితరులు కూడా అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

మామాట: ఆరోగ్యమే కదా మహా భాగ్యం… 

Leave a Reply