మార్చి 8  అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Share Icons:

మార్చి 8  అంతర్జాతీయ మహిళా దినోత్సవం :

మహిళా దినోత్సవం ఒక పుట్టుకకూఒక అస్తిత్వానికిఒక పునరుజ్జీవానికీఒక కొనసాగింపుకూ గౌరవం ఇచ్చే రోజు. నిజానికి భారతదేశంలో ఎక్కువమందికి అర్థమయ్యేలా చెప్పాలీ అంటే ఇదో విజయ దశమిమనిషి మనుగడ కోసం స్త్రీ అవసరాన్ని గుర్తించి స్మరించుకునే రోజు… భూమి మీద మనిషి అంటూ మిగలటానికి పురుషుని తో సమానంగా స్త్రీ అవసరం అన్న నిజాన్ని గుర్తు చేసే రోజు.. చుట్టూ స్త్రీల ఆర్తనాదాలు వింటూనే నిద్ర లేస్తున్న మనం పొద్దున్నే కళ్ళ ముందు కనిపించిన అమ్మకీభార్య కీసొదరికీ విమెన్స్ డే విషేస్” చెప్పేస్తాం… 

మరి బస్ లో కనబడే లేడీ కండక్టర్ కీపొద్దున్నే మీ కాలనీ రోడ్లను శుబ్రం చేసే మునిసిపల్ వర్కర్ కీఅన్నిటికన్నా తక్కువలో తక్కువగా 20 కేజీల బుట్ట నెత్తిన పెట్టుకొని కూరలమ్మటానికి వచ్చే అవ్వకీ ఎవరు చెబుతారుఅసలు మహిళకంటూఆమె పడే శ్రమకి గుర్తింపివ్వటానికంటూ ఒకరోజుందనీ…, తల్లీ నీ కాళ్ళమీద పడుకోబెట్టి నాకు లాల పోసిస్తన్యమిచ్చీసోదరిగా నాకంటూ కొన్ని విలువలు నేర్పీభార్యగా నన్నే ఒక మనిషి గా నిలబెట్టిన నీకు ప్రతీ రోజూ ఒక మగవాడిగా గౌరవం తోనూప్రేమతోనూ చూడబడుతున్న నేను ఒక్క రోజు నీకోసం కృతఙ్ఞత చెప్పుకోవటానికీ ఒక రోజుందని చెప్పుకోవాలని అనిపించినప్పుడు ఇదిగో మన చుట్టూ ఉండే ఈ పని మనిషీకూరలమ్మీమునిసిపాలిటీ వర్కర్మన ఇంటిపనులన్నీ చేసే అమ్మాభార్యా వీళ్ళకంటే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం రోజున ” ఇంకెవరు అర్హులు??

ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ఏ దేశపు రాణీ గారి పుట్టిన రోజో మరేదో చరిత్ర పురుషుని తల్లీభార్యా లు కొత్త దేశాన్ని ఆదుకున్న రోజో కాదు. ఒక సమిష్టి విజయానికి ప్రతీకసమానత్వం కోసం శ్రామిక వర్గం లో మహిళా సమానమే అన్న సమానత్వపు విజయపతాక ఎగసిన రోజు. ఒక వేతనపెంపు ఉధ్యమంఒక అస్తిత్వ వాద ఉధ్యమంగా మారి స్త్రీ శక్తి అంటే పిల్లలని కనటమోలేదంటే ప్రేమగీతాలకి పరవశించి పోవటమో కాదు. కార్మిక శక్తిగా తాము చేసే పనీ తక్కువకాదని నిరూపించుకున్నరోజు…. అందుకే ఇది కేవళం మహిళా దినోత్సవం కాదు శ్రామిక మహిళా దినోత్సవం..

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం’. క్రమక్రమంగా శ్రామిక’ పదం అంతర్ధానమై పోయింది. ఒక్కసారి గత చరిత్రలోకి మనం వెళితే..ఈ మార్చి 8కి దాదాపు 161 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటోంది. మొట్టమొదట అమెరికా లోని మహిళా కార్మికులు 1857 మార్చి 8న మొట్టమొదటి నిరసన ప్రదర్శన చేశారు. అమెరికా బట్టల మిల్లులోని మహిళా కార్మికులు తమ పని గంటలను 16 నుంచి 10గంటలకు తగ్గించమని కోరుతూ వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు. ఆ తర్వాత 1910లో డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌లో నిర్వహించిన రెండో సదస్సులో ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించగా. కమ్యూనిస్ట్ నాయకురాలు క్లారా జెట్కిన్ సమర్థించారు. 1914లో సమ్యుక్తంగా మార్చి 8న నిర్వహించారు. నిజానికి ఆ రోజుకు ఎలాంటి ప్రత్యేకతా లేదుఆదివారం సెలవు దినం కావడంతో అందరూ దినోత్సవం జరుపుకొన్నారు. ఆ తర్వాతి సంవత్సరంనుంచి అందరూ మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవంగా పాటించడం మొదలైంది.

అదే స్పూర్తితో భారతదేశంలో తొలిసారి అహ్మదాబాద్‌లో అనసూయ సారాభాయ్ టెక్స్‌టైల్స్ లేబర్ అసోసియేషన్ పేరుతో తొలి మహిళా కార్మిక సంఘం ఆవిర్భవించింది. ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని ఉధ్యమాలు జరిగాయి 1917మార్చి 8న రష్యన్ మహిళలు రొట్టె కోసం చేసిన ప్రదర్శన ఆనాడు రష్యన్ విప్లవానికి నాందీ వాక్యం పలికింది. ఆతర్వాత 1937లో మార్చి నెలలో స్పెయిన్‌లోని నిరంకుశ ఫ్రాంకో అణచివేత పరిపాలనకు వ్యతిరేకంగా మహిళలు ప్రదర్శన చేశారు. అలాగే 1937 మార్చి 8న ఇటలీలోని మహిళలు ముస్సోలినీ నిరంకుశాన్ని ఎలుగెత్తి నిరసించారు. ఇక 1974 మార్చి 8న వియత్నాంలోని మహిళలు అమెరికాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. అలాగే ఇరానియన్ స్త్రీల విముక్తి ఉద్యమం 1979 మార్చి8న ప్రారంభమైంది. పోనూ పోనూ శ్రామిక పదాన్ని కూడా సామ్రాజ్య వాదం మింగేసింది.

-భరద్వాజ

Leave a Reply