నేడు అతర్జాతీయ బాలికాదినోత్సవం

Share Icons:

తిరుపతి, అక్టోబర్ 11, 

మనది పురాతన సంస్కృతి. ఈదేశంలో స్త్రీకి అనాదిగా పూజనీయ స్థానం ఉంది. యత్రనార్యంతు పూజ్యతే తత్ర రమంతి దేవతాః అన్న విధానం మనది.  ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బేటీబచావో బేటీ పడావో అంటూ బాలికల ప్రధాన్యాన్ని చాటుతున్నారు.

ఇక 2012, అక్టోబర్ 11 వ తేదీని అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ప్రకటించారు. బాలుకలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పునరంకితమవడం  ఆ రోజు ప్రత్యేకత. బాలికా సాధికారికతను ప్రోత్సహించడం, బాలికల మానవహక్కును పరిరక్షిం చడం ప్రధాన ధేయం.

2018 ధీమ్…..  నైపుణ్యబాలికాశక్తి

ఆవిష్కరణలు, యాంత్రికతా ముప్పిరిగొన్న సరికొత్తయుగంలోకి మన బాలికలు ప్రవేశిస్తున్న కాలం ఇది. బాగా చదువుకుని, నైపుణ్యంకలిగినవారికి ఎంతో గిరాకీ ఉంది. అయితే యువతలో పావు భాగం వరకూ ఉన్న యువతులు చదువు లేకుండా, ఉపాధిలేకుండా, శిక్షణలేకుండా ఉండిపోతున్నారు.  వందకోట్ల మంది ( 1 బిలియన్ ) యువతలో 60 కోట్ల(600 మిలియన్ )మంది చిన్నారి యువతులే.. వీరు మరో దశాబ్ధకాలంలో పనికోసం ఉద్యోగాలు వెతుక్కోవలసి ఉంది. అయితే వీరిలో 90 శాతం మంది అభివృద్ధిచెందుతున్నదేశాలలో, అనధికార రంగంలో పనిచేయవలసి ఉంటుంది. వీరికి చాలాతక్కువ వేతనం లభిస్తుంది. ఒక్కోసారి అదీ ఉండదు. పైగా కడుపు నింపని ఈ పనులకోసం వారు శారీరిక, మానసిక దాడులను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఈ అక్టోబర్ 11 వ తేదీన మొదలు పెట్టి ఏడాది పొడవునా… ప్రపంచ బాలికా దినోత్సవం సందర్బంగా బాలికలలో వృత్తినైపుణ్యం కలిగించే విద్య అందించడానికి అందరం కృషిచేయాలి. ఇపుడు పాఠశాలలకు వెళుతున్న బాలికలు భవిషత్తులో ప్రధాన నైపుణ్యశక్తిగా ఎదగడానికి  చేయూతనివ్వాలి . అదే మన ప్రతిజ్ఞ.

అందుకే ధూర్జటి అంటాడు…

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్

వడసెన్? పుత్రులులేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్

చెడునే మోక్షపదం బపుత్రునకున్ శ్రీ కాళహస్తీశ్వరా.

అంటారు వంద మంది కౌరవులను కన్న కురురాజు పరిస్థితి ఏమైంది.  కావలసింది సంతానం,  బాలురుమాత్రమే కాదు… బాలిక కూడా సంతానమే. ఆమెకూ జీవించే హక్కుంది అని 500 ఏళ్లక్రితం ధూర్జటి చెప్పినా మనం వినడం లేదు. అదే విచారకరం.

మామాట: నేటి బాలికలే రేపటి భవితకు ఆధారం

Leave a Reply