అంతర్జాతీయ బీర్ డే 

Share Icons:

 తిరుపతి, ఆగష్టు 03,

మీకు తెలుసా? సైనోసిల్లికాఫోబియా (Cenosillica phobia) అంటే…  ఖాళీ గ్లాసు భయం? ఇదంతా ఎందుకో .. అంటే ఈ రోజు ఆగష్టు 3 కదా, మనం ప్రేమికుల దినోత్సవం, పర్యావరణ దినేత్సవం జరుపుకుంటాం కదా… అలాగే ఈ రోజు ను ప్రతి సంవత్సరం అంతర్జాతీయ బీర్ డేగా జరుపుకుంటారు. ఈ రోజు, ఈ పానీయం తయారీలో పాల్గొన్నవారిని అభినందించడానికి, మద్యపాన కళను ఆస్వాదించడానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా మందు ప్రియులు బీర్ డే జరుపుకుంటారు. బీరు తయారీ, పంపిణీ, సరఫరావంటి అనేక విభాగాల్లో పనిచేసే వారిని గుర్తుచేసుకుంటూ మిత్రులతో కలిసి ఈ రోజు బీరు తాగడం వేడుక.

బీర్ అనేది మద్యం. అయితే ఇది కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే తృణధాన్యాలనుండీ తయారు చేయబడే పానీయం.

బీరు త్రాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

• ఇది గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

• ఎముకలకు బలం చేకూర్చుతుంది

• కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది

• రక్తహీనత నిరోధిస్తుంది

• డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

• కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

• మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది

• ఇది వయస్సుమీరడాన్ని ఆలస్యం చేయడంలో సహాయపడే విటమిన్-ఇ యొక్క శక్తి, ప్రభావాన్ని పెంచుతుంది• ఒత్తిడి నివారించి, నిద్ర పోవడానికి సహకరిస్తుంది.

 

మామాట: బీరయినా- బారయినా  నియంత్రణలో ఉండాలి బాబూ

Leave a Reply