TRENDING NOW

హైదరాబాద్‌లోని మైనార్టీ గురుకుల కళాశాలలో ప్రవేశాలు..

హైదరాబాద్‌లోని మైనార్టీ గురుకుల కళాశాలలో ప్రవేశాలు..

హైదరాబాద్, 21 మే:

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జిల్లా పరిధిలోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహ్మద్‌ ఖాసీం ఒక ప్రకటనలో కోరారు.

2018-2019 విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్‌ మీడియంలో చేరిక కోసం పదో తరగతిలో 60 శాతం మార్కులు సాధించిన మైనార్టీ, ఇతర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

పాత బస్తీలోని బర్కాస్ మైనార్టీ గురుకుల కళాశాలలో ఎంపీసీలో 30, బైపీసీలో 30, సీఈసీలో 20 సీట్లు ఉన్నాయని, 75 శాతం మైనార్టీ, 25 శాతం ఇతర విద్యార్థులకు కేటాయించామని తెలిపారు.

ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పదో తరగతి మార్కుల మెమో, ఆధార్‌ కార్డు, ఆదాయ, కుల ధ్రువీవకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌:

http://tmreis.telangana.gov.in/home.do

మామాట: హైదరాబాద్ పరిధిలోని మైనారిటీ విద్యార్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: