టెక్కలిలో మంత్రికి వైసీపీ చెక్ పెడుతుందా

Share Icons:

టెక్కలి, 13 మార్చి:

ఈ సారి ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నుండి పోటీ చేసి మళ్ళీ గెలవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చూస్తుంటే….తమపై ఎక్కువ విమర్శలు చేస్తున్న అచ్చెన్నాయుడుకి చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తోంది.

కాగా, గత ఎన్నికల్లో నువ్వా, నేనా అన్నట్టు సాగిన పోరులో అచ్చెన్న విజయం సాధించారు. అయితే గతంలో నియోజకవర్గంలోని ప్రధాన సామాజిక వర్గమైన కాళింగుల్లో గ్రూపులు గోల అచ్చెన్నాయుడు విజయానికి మేలుచేశాయని రాజకీయ విశ్లేషకులు భావించారు.

గెలిచి మంత్రి అయిన ఆయన అభివృద్ధే అజెండాగా ఎంచుకొని రానున్న ఎన్నికల్లో వెళ్లాలన్నదే అచ్చెన్నాయుడు వ్యూహం. అయితే ఈ సారి అచ్చెన్నాయుడు వైసీపీ నుండి గత్తో పోటీ ఎదురుకునేలా ఉన్నారు.

ఇటీవల వైసీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఇక్కడ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.  

అయితే టెక్కలి నియోజకవర్గంలో సుమారు 72వేల మంది కాళింగ ఓటర్లు ఉండగా, సుమారు 15వేల మంది గల వెలమ సామాజిక వర్గం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఈసారి రాజకీయ ప్రత్యర్థులు కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారికి ఎదురొడ్డి నిలవగలరా అన్నదే సందేహం.

అయితే కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో అచ్చెన్నాయుడు హావా కనిపిస్తుంది. ఇక వైసీపీకి నందిగాం మండలం ఎక్కువ మద్ధతు ఉంది.

అటు వైసీపీలో జరిగిన మార్పులు, దానికి తగ్గట్టుగా నేతలు సమన్వయంతో పనిచేయడం వంటి విషయాలు.. అచ్చెన్నాయుడికి ధీటైన సమాధానం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. మరి చూడాలి ఈసారి టెక్కలి ఎవరికి దక్కుతుందో

మామాట: మరి మంత్రికి వైసీపీ చెక్ పెడుతుందా

Leave a Reply