ఆసక్తికరంగా మంగళగిరి పోరు

Share Icons:

అమరావతి, 14 మార్చి: 

ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నుండి పోటీ సిద్ధం కావడంతో…రాజధాని ప్రాంతంలో రాజకీయం వేడెక్కింది. అయితే మొదటి లోకేశ్‌ను విశాఖ జిల్లా భీమిలి లేదా విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి బరిలో నిలపాలని భావించినా… చివరకు మంగళగిరి సీటును కుమారుడికి ఖరారు చేశారు చంద్రబాబు.

రాజధాని అమరావతి ప్రాంతం కావడంతో… లోకేశ్ పోటీ కారణంగా ఇక్కడ టీడీపీకి సానుకూలతలు ఉంటాయని చంద్రబాబు అంచనా వేసినట్టు సమాచారం. మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఓడించాలంటే లోకేశ్ వంటి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని టీడీపీ భావించినట్టు తెలుస్తోంది.

ఇక మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ చేయడం ఖాయం కావడంతో… వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సీటును మరోసారి ఎమ్మెల్యే ఆర్కేకు కేటాయించాలని వైసీపీ నిర్ణయించినా, తాజా పరిణామాల నేపథ్యంలో జూనియర్ మామ నార్నే శ్రీనివాసరావును బరిలో దింపే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

లోకేశ్‌ను ఎదుర్కోవాలంటే ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన అభ్యర్థి ఉండాలని భావిస్తున్న వైసీపీ… ఇటీవల పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావును ఇక్కడి నుంచి పోటీ చేయించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  అటు గుంటూరూ పరిధిలో నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నార్నే శ్రీనివాసరావు కూడా సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. మొత్తానికి లోకేశ్‌కు పోటీ జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు పోటీలో ఉంటే… మంగళగిరి పోటీ రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.  మరి ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో

మామాట¨బంధువుల పోరు ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది

Leave a Reply