ఇక్కడ గెలిచిన వాళ్ళదే అధికారం…

Share Icons:

ఏలూరు, 19 మార్చి:

పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని ఏలూరు…ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ 1989లో ఇక్కడ కాంగ్రెస్ గెలవగా రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1994, 99లలో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చాయి. 2014 ఎన్నికలో మళ్ళీ టీడీపీ వచ్చింది. గత ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన బడేటి కోటరామరావు(బుజ్జి)..ఈ సారి మళ్ళీ ఎన్నికల బరిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) మరోసారి పోటీలో ఉన్నారు.

బుజ్జి అధికారంలో ఉన్న ఐదేళ్లు అభివృద్ధి బాగానే జరిగింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యేలా చేశారు. కానీ త్రాగునీటి సమస్య పూర్తిగా సమసిపోలేదు. నగర శివార్లలో ప్రజలకి నీటి కొరత పూర్తిగా తీరలేదనే చెప్పాలి. పైగా నగరంలో మంచి పట్టున్న ఏలూరు మేయర్‌ నూర్జహాన్, ఆమె భర్త, కోఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబులు వైసీపీలో చేరడం బుజ్జికి దెబ్బనే చెప్పాలి. మరోవైపు గతంలో ఏలూరు నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆళ్ళ నాని మరోసారి వైసీపీ నుండి పోటీకి దిగుతున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై బాగానే స్పందించారు. అలాగే పార్టీ కార్యక్రమాలన్నీ, నవరత్నాలని ప్రజల్లోకి తీసుకెళ్లి బలపడ్డారు.

ఇక సీనియర్ నేత రెడ్డి అప్పలనాయుడు జనసేన అభ్యర్థిగా ఏలూరు నుండి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువగానే ఉండటంతో జనసేనకి కలిసొచ్చే అవకాశం ఉంది.

మామాట: మరి ఇక్కడ గెలిచి ఎవరు అధికారం సొంతం చేసుకుంటారో 

Leave a Reply