రేవంత్-గవర్నర్ మధ్య సరదా సంభాషణ..కొడతారేమో అని రాలేదన్న రేవంత్

Share Icons:

హైదరాబాద్:

 

స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ నరసింహన్ హైదరాబాద్‌లో గురువారం గవర్నర్ ఎట్ హోం కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్- కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మధ్య సరదా సంభాషణ జరిగింది. కార్యక్రమానికి వచ్చిన అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా చేతులు కలిపిన గవర్నర్.. రేవంత్‌ను చూస్తూ ఆగిపోయారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన చర్చ అక్కడ నవ్వులు పూయించింది.

 

గవర్నర్: వచ్చావా? రాలేదేమోనని నీ కోసమే చుట్టూ చూస్తున్నా, రేవంత్: మీరు ఆహ్వానించాక రాకుండా ఉంటానా?, గవర్నర్: మరి, నన్ను కలవడానికి వస్తానన్నారుగా, ఎందుకు రాలేదు, రేవంత్: మీరు కొడతారేమోనని, గవర్నర్: నేను కొట్టానా?.. మీరే నన్ను కొట్టారు (గతంలో అసెంబ్లీలో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ), రేవంత్: అందుకే రాలేదు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఎక్కడ కొడతారోనని భయపడే రాలేదు అని రేవంత్ బదులివ్వడంతో ‘ఎట్ హోం’లో పాల్గొన్న నేతలందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

 

ఆ తర్వాత పక్కనే ఉన్న షబ్బీర్ అలీని గవర్నర్ పలకరిస్తూ.. ‘‘నాపై కోపంగా ఉన్నట్టున్నారే’’ అని అన్నారు. పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే అందుకుని.. ‘మా షబ్బీర్ బిర్యానీ పెడతాడు తప్ప ఎవరినీ కోపగించుకోడు’ అని బదులిచ్చారు.

 

Leave a Reply