రైలు కోచ్‌ రెస్టారెంట్లో తిందామా !

Share Icons:

తిరుపతి, సెప్టెంబర్ 07,

ఇపుడు కొత్తక వింత, పాతొక రోత.. అంతా వరైటీ కోరుకుంటున్నారు.  లైఫ్ లో రొటీన్ గా ఉంటే ఎవరికీ ఏదీ నచ్చడం లేదు. ఇంకే ముంది సృజన కారులకు చేతినిండా పని. అలాంటిదే ఇదీనూ…

చెన్నై నగరంలోని రైలు మ్యూజియం సందర్శించేవారు ఇకపై రైలు కోచ్‌ రెస్టారెంట్లో రుచికరమైన భోజనాన్ని ఆశ్వాదించ వచ్చు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ పేరుతో ప్రారంభమైన ఈ రెస్టారెంట్‌ను ఎల్‌హెచ్‌బీ కోచ్ రైలు బోగీలో ఏర్పాటు చేయడం గమనార్హం. దీన్ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) ప్రత్యేకంగా రూపొందించింది.

ఈ రెస్టారెంట్.. దేశంలో రెండో రైల్ కోచ్ రెస్టారెంట్‌. కాగా  దేశంలోని  ఇటువంటి తొలి రైల్ కోచ్ రెస్టారెంట్ భోపాల్‌లో ఉంది. 2015లో దీన్ని ప్రారంభించారు. చెన్నై రైల్ కోచ్ రెస్టారెంట్లో మీకు నచ్చిన రుచికరమైన భోజనాన్ని తినొచ్చు. మెను కూడా దేశంలోని ఫేమస్ రైళ్లు పేర్లతో ఉంటాయని అధికారులు తెలిపారు. ఒకేసారి 64 మంది ఇక్కడ కూర్చొని భోజనం చేయొచ్చన్నారు. పర్యాటకులను ఆకర్షించడానికే ఈ ప్రయత్నమంతా అని వేరే చెప్పాలా.

మామాట:   మడిసన్నాక కూసంత కళాపోసన ఉండాలికదా మరి


Leave a Reply