టెస్ట్ సిరీసుకు బుమ్రా దూరం: తొలి టీ20లో టీమిండియా మహిళా జట్టు ఘనవిజయం

Injured Jasprit Bumrah ruled out of South Africa Test series, Umesh Yadav named replacement
Share Icons:

ఢిల్లీ: అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో మొదలు కానున్న టెస్ట్ సిరీస్ కు టీమిండియా పేసర్ బుమ్రా దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా బుమ్రా దూరమయ్యాడు. అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. ఏడు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరం ఉండడంతో నవంబర్ 3 నుంచి 26 వరకు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్‌లకు కూడా బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సఫారీలతో టీమ్‌ఇండి యా తొలి టెస్టు విశాఖపట్నం (అక్టోబర్ 2-6)లో జరుగనుండగా.. పుణె(10-14), రాంచీ (19-23) తదుపరి రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

మహిళా జట్టు విజయం

5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గి సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో…ఆ స్థానంలో వచ్చిన 15 ఏళ్ల షఫాలీ వర్మ (0) నాలుగు బంతులాడి ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. ఆరంభంలోనే వికెట్ పడ్డా.. జెమీమా రోడ్రిగ్స్ (19)తో కలిసి చక్కటి షాట్లు ఆడిన స్మృతి మందన ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది.

అయితే ఆ తర్వాత వరుసగ్ వికెట్లు పడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగులు చేశారు. ఇక 131 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టు తొలి ఓవర్ లోనే 18 పరుగులు రాబట్టి దూకుడు ప్రదర్శించింది. అయితే స్పిన్నర్లు రంగ ప్రవేశం చేయడంతో.. స్కోరు బోర్డుకు బ్రేకులు పడ్డాయి. 4 ఫోర్లు కొట్టి దూకుడు మీదున్న లిజెల్లీ లీ (16)ని శిఖ ఔట్ చేసింది. అయితే అసలు దెబ్బ మాత్రం దీప్తి కొట్టింది. ఐదో ఓవర్లో బ్రిట్స్ (3), డి క్లెర్క్ (0)ను ఔట్ చేసి సఫారీలను కష్టాల్లోకి నెట్టింది. ఆ తర్వాత 9వ ఓవర్‌లో పూనమ్ యాదవ్ డబుల్ ధమాకా కొట్టింది. వరుస బంతుల్లో వాల్‌వర్ట్ (14), కెప్టెన్ లుస్ (0)ను పెవిలియన్ పంపింది. ఫలితంగా 10 ఓవర్లు ముగిసేసరికి సఫారీలు 51/5తో నిలిచారు. డు ప్రీజ్ (43 బంతుల్లో 59; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కడవరకు పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో సఫారీ జట్టు 19.5 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

 

Leave a Reply