బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్‌ ఎస్‌5 ప్రొ..

Share Icons:

ముంబై: ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు ఇన్ఫినిక్స్‌ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎస్‌5 ప్రొను తాజాగా విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. రూ.9,999 ధరకు ఈ ఫోన్‌ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 13వ తేదీ నుంచి లభ్యం కానుంది.

ఇన్ఫినిక్స్‌ ఎస్‌5 ప్రొ ఫీచర్లు…

6.53 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే

2220 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

2 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి22 ప్రాసెసర్‌

4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 10

48, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్‌ 5.0, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మీడియాప్యాడ్‌ ఎం5 లైట్‌

మొబైల్స్‌ తయారీదారు హువావే తన మీడియాప్యాడ్‌ ఎం5 లైట్‌ ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌కు గాను 64జీబీ వేరియెంట్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.22,990 ధరకు ఈ ట్యాబ్లెట్‌ వినియోగదారులకు లభిస్తున్నది. ఇక ఈ ట్యాబ్‌లో.. 10.1 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో, 8, 8 మెగాపిక్సల్‌ బ్యాక్‌, ఫ్రంట్‌ కెమెరాలు, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్‌ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్‌ సి, 7500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

రియల్‌మి బ్యాండ్‌

మొబైల్స్‌ తయారీదారు రియల్‌మి.. రియల్‌మి బ్యాండ్‌ పేరిట ఓ నూతన స్మార్ట్‌బ్యాండ్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.1499 ధరకు ఈ బ్యాండ్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇందులో.. 0.96 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే, హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, 9 రకాల స్పోర్ట్స్‌ మోడ్స్‌, ఐపీ68 వాటర్‌ రెసిస్టెన్స్‌, బ్లూటూత్‌ 4.2 ఎల్‌ఈ, కస్టమైజబుల్‌ క్లాక్‌ ఫేసెస్‌, స్లీప్‌ ట్రాకర్‌, సెడెంటరీ రిమైండర్‌, 6 నుంచి 9 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

 

Leave a Reply