భారత్‌లో విడుదలైన ఇన్ఫినిక్స్ ఎస్‌4 స్మార్ట్‌ఫోన్..

Share Icons:

ముంబై, 21 మే:

హాంకాంగ్‌కి చెందిన ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ ఎస్‌4 ను ఈరోజు భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.8,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగదారుల‌కు ఈ నెల 28వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

ఇన్ఫినిక్స్ ఎస్‌4 ఫీచ‌ర్లు…

6.21 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్.

3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌.

13, 8, 2 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌.

డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

మామాట: అందుబాటు ధరలో మంచి ఫీచర్లు ఉన్నాయి

Leave a Reply