అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్లు

Infinix Hot 8 With Triple Rear Cameras, 5,000mAh Battery Launched in India
Share Icons:

ముంబై:

ప్రముఖ మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ హాట్ 8 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

కాస్మిక్ పర్పుల్, క్యుట్జల్ క్యాన్ కలర్ ఆప్షన్లలో విడుదలైన ఈ ఫోన్‌ను ఈ నెల 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు.

కాగా అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే రూ. 6,999 ధరకు ఈ ఫోన్‌ను అందివ్వనున్నారు. ఆ తరువాత ధర పెంచనున్నారు.

ఇన్ఫినిక్స్ హాట్ 8 ఫీచర్లు..

6.52 ఇంచుల డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై,.13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

జియోనీ ఎఫ్ 9 ప్లస్

జియోనీ సంస్థ ఎఫ్9 ప్లస్ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.7690 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

జియోనీ ఎఫ్9 ప్లస్ ఫీచర్లు

6.26 ఇంచ్ డిస్‌ప్లే, 1.65 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్. 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్, 4050 ఎంఏహెచ్ బ్యాటరీ.

తగ్గింపు ధరల్లో మొబైల్స్ ఫ్లిప్‌కార్ట్

దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ సేల్ ఈరోజు ప్రారంభం కాగా ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో తగ్గింపు ధరల్లో ఫోన్లు రానున్నాయి.

ఒప్పో ఎ3ఎస్, రెడ్‌మీ 6, మోటోరోలా వన్ విజన్, అసుస్ 6జడ్, ఒప్పో ఎఫ్11 ప్రొ, వివో వి15 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్ ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. అలాగే కేవలం రూ.99కే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను అందిస్తున్నారు.

ఇక పలు ఫోన్లపై ఎక్స్‌ఛేంజ్ సదుపాయంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో ఫోన్లను కొనే వెసులుబాటును కూడా అందిస్తున్నారు

Leave a Reply