వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
Views:
7

వేములవాడ, 13 ఫిబ్రవరి:

రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు మంగళవారం ఘనంగా కొనసాగుతున్నాయి.

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, టీటీడీ తరపున జేఈవో శ్రీనివాస్ రాజు పట్టు వస్ర్తాలు సమర్పించారు.

minister indra karan reddy at vemulavada temple

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి గుడికి విచ్చేసిన ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు…

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు పట్టించుకోని ప్రాచీన చరిత్ర కలిగిన ప్రధాన ఆలయాలను సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు.

రాజన్న క్షేత్రం అభివృద్ధిని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వచ్చే వానా కాలంలో వర్షాలు సంవృద్ధి గా కుర‌వాల‌ని, ప్రజలు పాడి, పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

మామాట: పండుగ కావడంతో అందరూ గుడి బాట పట్టినట్టున్నారు…

English Summary: Telangana minister indrakaran reddy offered pattuvastralu to rajarajeshwari temple at vemulavada on behalf of telangana government

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *