ఐరాసలో భారత సంతతి మహిళకు కీలక పదవి

Share Icons:

ఐరాస, జూన్ 03,

 భారత సంతతి మహిళకు ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో కీలక పదవి దక్కింది. మహిళా సాధికారతే లక్ష్యంగా అనితా భాటియాకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవిలో నియమించినట్టు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ వెల్లడించారు. ఆమె ఈ పదవికి న్యాయం చేస్తారనే తాను భావిస్తున్నానన్నారు.

ప్రపంచ బ్యాంక్‌ గ్రూపులో భాటియా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. స్ట్రాటిజిక్‌ మేనేజ్‌మెంట్‌, రిసోర్స్‌ మొబిలైజేషన్‌, మేనేజ్‌మెంట్‌ అంశాలపై ఆమెకి విశేష పరిజ్ఞానం ఉన్నది. ప్రస్తుత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లక్ష్మీ పూరీ నుంచి అనితా భాటియా బాధ్యతలు స్వీకరించారు. ఆమె కోల్‌కతా వర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు. యేల్‌ వర్సిటీ నుంచి మాస్టర్‌ డిగ్రీలో పట్టా పొందారు. జార్జిటౌన్‌ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డాక్టరేట్‌ పొందారు.

మామాట- మహిళలకు అనుకుంటే అడ్డేముంది…  లేచింది మహిళా లోకం

Leave a Reply