టీ-20 ట్రై సిరీస్‌కి కెప్టెన్‌గా రోహిత్ శర్మ..?

Share Icons:

ట్రై సిరీస్‌ షెడ్యూల్….

ఢిల్లీ, 24 ఫిబ్రవరి:

శ్రీలంకలో మార్చి 6-18 తేదీల మధ్యలో జరగనున్న ముక్కోణపు టీ-20 సిరీస్ లో టీమిండియాకి రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, భువనేశ్వర్,బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చే అవకాశమున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లో యువ ఆటగాళ్లకు చోటు కల్పించనున్నారు.

భారత్, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ జట్టు ఈ ట్రై సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుంది. అంటే, ప్రతి జట్టూ మిగిలిన రెండు జట్లతో తలపడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య మార్చి 18న ఫైనల్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లన్నీ కొలంబొ లోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి.

ట్రై సిరీస్ షెడ్యూల్…

  • మార్చి6 – ఇండియా వర్సెస్ శ్రీలంక         రాత్రి 7 గంటలకు
  • మార్చి 8 – ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్   రాత్రి 7 గంటలకు
  • మార్చి 10 – శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్       రాత్రి 7 గంటలకు
  • మార్చి 12 – శ్రీలంక వర్సెస్ ఇండియా       రాత్రి 7 గంటలకు
  • మార్చి 14 – బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా    రాత్రి 7 గంటలకు
  • మార్చి 18 – బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక         రాత్రి 7 గంటలకు
  • మార్చి 18 ఫైనల్

మామాట: మరి కొత్త ఆటగాళ్లతో సిరీస్ సాధిస్తారా..?

English summary:

The Indian team is set to play a T20I tri-series in Sri Lanka this March, and the top cricketers are likely to be rested for the tournament. According to Times of India, skipper Virat Kohli, MS Dhoni, Bhuvneshwar Kumar, Jasprit Bumrah and Hardik Pandya won’t be part of the squad for the series.  In skipper Kohli’s absence Rohit will lead Team India.

Leave a Reply