Header Banner
Header Banner
TRENDING NOW

భారత పాస్ పోర్ట్ హోల్డర్లు తెలుసుకోవాల్సిన కొత్త వీసా నియమాలు

భారత పాస్ పోర్ట్ హోల్డర్లు తెలుసుకోవాల్సిన కొత్త వీసా నియమాలు

 తిరుపతి, అక్టోబర్ 08,

భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు విదేశాలలో ప్రయాణించే సమయంలో పలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వీసా నియమాలు తెలియనివారు విమానాశ్రయాలలో ఇబ్బందులు పడుతూ ఉంటారు.  మీరు భారతీయ పాస్‌పోర్ట్ కలిగిఉండి, తరచూ ప్రయాణించే వారయితే, మీరు ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ   వీసా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

Life Homepathy
treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

2018 నాటికి, 59 దేశాలు భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు  వీసా ఆన్ అరైవల్, వీసా ప్రీ ప్రయాణావకాశాలు అందజేస్తున్నాయి. కానీ ఐరోపా, అమెరికాలలో ఉన్న చాలా దేశాలు మీ పాస్‌పోర్ట్‌లో వీసా స్టాంప్ చేయబడాలని కోరుతున్నాయి.  అయితే, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు స్వల్పంగా ఉపశమనం కలిగించే విషయంలో, వీసా నిబంధనలు కొంచెం సడలించడం జరిగింది. పాత నిబంధనల స్థానంలో కొత్త వీసా నియమాలు ఉన్నాయి. మీరు భారతీయ పాస్‌పోర్ట్ ను కలిగి ఉంటే, ఇది మీ ప్రయాణ సమస్యలను కొంచెం తగ్గించగలదు.

క్రొత్త నియమాలను పరిశీలించండి:

మీరు ఫ్రాన్స్‌లో ఏ విమానాశ్రయము యొక్క అంతర్జాతీయ జోన్ ద్వారా ప్రయాణించినా, మీకు ఇకపై విమానాశ్రయం ట్రాన్సిట్ వీసా అవసరం లేదు.

మీరు ఓమెన్ కి ప్రయాణం చేస్తున్నట్లయితే, మీరు ఇప్పుడు ఒక నెలవారీ పర్యాటక వీసాను 20 ఓమెన్ రియాల్ (రూ .3,700) కోసం అక్కడికి చేరుకున్న వెంటనే పొందవచ్చు. అయితే ఈ నియమం మీరు  అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, UK, జపాన్ లేదా స్కెంజెన్ రాష్ట్రాల్లో నివశిస్తున్నవారుగానీ, లేదా ఎంట్రీ వీసా  కలిగి ఉండాలి. అలాగే  మీతో పాటు మీ జీవిత భాగస్వామి, పిల్లలు కూడా వీసా ఆన్ అరైవల్ పొందగలరు.

మీరు మయన్మార్‌కు ప్రయాణం చేయాలనుకుంటే అది ఇపుడు ఎంతో సులభం.. మీరు రోడ్డుమార్గంలో వెళ్లాలనుకుంటే కనుక సరిహద్దులోని చెక్‌పోస్ట్‌లో మీ ఇ-వీసాని చూపితే చాలు. ప్రయాణానికి  ముందు కేవలం రెండురోజుల్లో మీరు ఇ-వీసా   పొందవచ్చు.

యుఎఇ ఇప్పుడు దేశంలో పర్యటించడానికి సుముఖంగా ఉన్న అత్యంత నైపుణ్యం గల నిపుణులకు, పెట్టుబడిదారులకు 10 సంవత్సరాల దీర్ఘకాల వీసాను అందిస్తోంది. ఈ వీసాలు సైన్స్, మెడిసిన్, పరిశోధన రంగాలలో నిపుణులకు మంజూరు చేయబడ్డుతున్నాయి. అలాగే “అసాధారణమైన విద్యార్థులకు” కూడా వీసాలు మంజూరు చేయబడుతున్నాయి.

ఇజ్రాయెల్ ఇప్పుడు ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు రూ. 1,700 నుండి రు. 1,100 వరకు వీసా ఫీజును తగ్గించింది. క్రొత్త ధరను పొందటానికి మీరు B2 వీసా (వ్యాపారం, పర్యాటక లేదా సమావేశం ) విభాగంలో వీసా కోసం దరఖాస్తు చేయాలి.

భారతదేశం నుండి ఉజ్బెకిస్తాన్‌కు ప్రయాణం చేయడం ఇప్పుడు ఎంతో  సులభం. మీ పర్యటనకు మూడు రోజుల ముందు మీ ఇ-వీసా అప్లికేషన్‌ను సమర్పించండి. మీరు 30-రోజుల వ్యవధి కలిగిన  సింగిల్ ఎంట్రీ ఇ-వీసా  వెంటనే పొందవచ్చు.

ఎమిరేట్స్‌లో (UAE)పర్యాటక రంగంను ప్రోత్సహించడానికి కొత్త వీసా నియమాలను UAE ప్రకటించింది. జూలై 15 మరియు సెప్టెంబర్ 15 మధ్య ప్రతి సంవత్సరం యుఎఇ, మీతో పాటు ఉన్న 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారికి వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తోంది. మీ కుటుంబం సెలవు కోసం దుబాయ్ లేదా అబుదాబికి ప్రయాణిస్తున్నప్పుడు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను కలిగి ఉంటే, మీ పిల్లలు వీసా రహితంగా ప్రయాణం చేయవచ్చు.

దేశంలో పర్యాటక రంగాన్ని పెంచడానికి సౌదీ అరేబియా ప్రస్తుతం 25 ఏళ్లు ఆపై వయస్సులో ఉన్న మహిళలకు టూరిజం వీసాలను జారీ చేస్తోంది.  మగ తోడు లేకున్నా, ఒంటరి మహిళలకు కూడా ఇపుడు వీసాలిస్తున్నారు.  సౌదీ అరేబియా ఈ  విధంగా వీసా నియమాలను సడలించడం ఇదే మొదటిసారి. కొత్త రాజు  మహమ్మద్ బిన్ సల్మాన్ దేశంలో ఒక “ఆధునిక, బహిరంగ ఇస్లాం” కు హామీ ఇచ్చిన  నేపథ్యంలో కొత్త వీసా నియమాలు  వెలుగుచూస్తున్నాయి.

భారతీయులకు అమెరికా లేదా యూరోపియన్ దేశాలతో సమానంగా ఉండే వీసా నియమాలు అమలు చేస్తున్న ఆసియా దేశాలలో జపాన్ ఒకటి. అయితే ఇప్పుడు జపాన్ భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారికి దేశంలో ప్రయాణ నిబంధనలను సాపేక్షంగా తగ్గించింది. మీరు జపాన్‌లో స్వల్ప-కాలానికి పర్యటించడానికి లేదా బహుళ-ఎంట్రీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, మీ సందర్శన కోసం ఒక ఉద్యోగ సర్టిఫికేట్ లేదా వివరణ లేఖను చూపించాల్సిన అవసరం లేదు. మీరు పర్యాటక ప్రయోజనాల కోసం ప్రయాణిస్తున్నట్లయితే ఇటీవలి ఫోటో, మీ ఆర్థిక స్థిరత్వం తెలిపేరుజువుతో పాటు మీ వీసా దరఖాస్తు చేసుకుంటే చాలు. జపాన్‌కు మీ పర్యటన వ్యాపార సంబంధమైనదైతే, సంబంధిత వ్యాపార సంస్థతో మీ అనుబంధాన్ని నిరూపించడానికి అవసరమైన పత్రాలు మీరు చూపించాల్సి ఉంటుంది.

భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు జింబాబ్వేలో దిగిన తరువాత ఆరైవల్ ఆన్ వీసా పొందవచ్చు. జింబాబ్వే వీసా నియమాలను సడలించిన 28 దేశాలలో భారత్ కూడా ఉంది.

 

మామాట: డబ్బులున్నా ఎక్కడికంటే అక్కడికి వెళ్లలేమనమాట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: