కాంగ్రెస్ పార్టీకీ ఓ టీవీ చానల్.. 24న ‘ఐఎన్‌సీ టీవీ’ ప్రారంభం

Share Icons:
  • నిన్న చానల్ విజన్ డాక్యుమెంట్ విడుదల
  • తొలుత ఇంగ్లిష్, హిందీలో అందుబాటులోకి
  • త్వరలో స్థానిక భాషలకూ విస్తరిస్తామన్న కాంగ్రెస్
Congress launches digital media platform INC TV

కాంగ్రెస్ పార్టీ గళాన్ని వినిపించేందుకు ఓ సరికొత్త టీవీ చానల్ రాబోతోంది. ‘ఐఎన్‌సీ టీవీ’ పేరుతో వస్తున్న ఈ చానల్‌ను ఈ నెల 24న అధికారికంగా ప్రారంభించనున్నారు. నిన్న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఐఎన్‌సీ టీవీకి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను పార్టీ విడుదల చేసింది.

 

బడుగు బలహీన వర్గాలకు గొంతుకగా మారనున్న తమ చానల్‌ను పంచాయతీ రాజ్ రోజున ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే, రణ్‌దీప్ సూర్జేవాలా మీడియాకు తెలిపారు. ఐఎన్‌సీ టీవీలో 8 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నారు. తొలుత ఇంగ్లింగ్, హిందీ భాషల్లోనే చానల్ ప్రసారం అవుతుందని, మున్ముందు స్థానిక భాషాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

 

-రాంనారాయణ, జర్నలిస్ట్.

Leave a Reply