ఇకపై ఆ యాప్ ఉంటే చాలు… ఓటు హక్కు పొందొచ్చు…

Share Icons:

ఢిల్లీ, 15 ఫిబ్రవరి:

మన దేశంలో ఏ పౌరుడికైనా ఓటు హక్కు కావాలంటే మనం ఉండే ప్రాంతంలోని సంబంధిత ఆఫీసుకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. అదే ఓటరు ఏదైనా మార్పులు చేర్పులు చేయించుకోవాలంటే సంబంధిత ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాలి.

ఇకపై ఇవన్నీ అక్కర్లేదు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో ఓ యాప్ ఉంటే చాలు అంటున్నారు అధికారులు.

ఇంతకీ ఏంటా యాప్…? అందులో ఏమేం ఆప్షన్లు ఉంటాయి అంటే…..

ఆ యాప్ పేరు ‘ఈరోనేట్’. ఓటర్ గా నమోదు చేసుకోవడం, ఓటు హక్కును త్వరగా పొందడం, ఓటర్ తన నివాస చిరునామా వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడం వంటి పనులను సులభతరం చెయ్యడానికి భారత ఎన్నికల సంఘం ఈ యాప్‌ని అందుబాటులోనికి తీసుకు రానుంది.

ఇక ఓటరుకి సమబంధించిన ఏ సమాచారాన్ని అయినా మార్చుకునేందుకు కార్యాలయాల వరకూ వెళ్లాల్సిన శ్రమ ఉండదు.

ఈ యాప్ నుంచి ఓటరే తన పని తాను చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు ఈ అప్లికేషన్‌లో భాగమయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి ఓపీ రావత్ తెలిపారు.

గుజరాత్, హిమాచల్ సహా ఇంకా కొన్ని రాష్ట్రాలు ఈ వ్యవస్థను అమలు చేయలేదన్నారు.

జూన్ నాటికి మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ వెబ్ ఆధారిత అప్లికేషన్‌లో భాగమవుతాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను అమలు చేయడం సాధ్యమవుతుందని చెప్పారు.

ఓటర్లు తమ మొబైల్‌కు వచ్చే ఓటీపీ సాయంతో తమ ఓటరు ఐడీ వివరాల్లో మార్పులు చేసుకోవచ్చని ఆయన వివరించారు.

ఒకవేళ కొత్త చిరునామా వివరాలు అందులో ఎంటర్ చేస్తే.. గతంలో తెలిపిన చిరునామా అతని ప్రొఫైల్ నుండి డిలీట్ అవుతుందని రావత్ తెలిపారు.

మామాట: త్వరలోనే ఆన్‌లైన్ ఓటింగ్ కూడా వస్తే బాగుండు…

English summary:

The Election Commission is going to provide an App called ‘ERONET. EC will be able to make this app available to facilitate the registration of voters, getting quick access to voter and making changes in his residence address details soon.

Leave a Reply