ఐసీసీ అవార్డుల్లో ‘కింగ్’ కోహ్లీ…

Share Icons:

దుబాయ్‌, 18 జనవరి:

భారత్ పరుగుల యంత్రం, కెప్టెన్ కోహ్లీ ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌‌గా నిలిచాడు.

2017 సంవత్సరానికి గాను ఐసీసీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది.

అలాగే టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ ఆటగాళ్ల ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ అవార్డులని ప్రకటించింది.

టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచినందుకుగాను కోహ్లీ ఐసీసీ సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌ ట్రోఫీని అందుకున్నాడు.

ఈ అవార్డుని గెలుచుకోవడం కోహ్లికి ఇదే తొలిసారి.

దీంతోపాటు కెరీర్లో రెండోసారి ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును కోహ్లీ దక్కించుకున్నాడు. బెస్ట్ వన్డే ప్లేయర్‌గా 2012లో కోహ్లీ తొలిసారి ఎంపికయ్యాడు. ఇక 2017లో కూడా కోహ్లీ 76.84 సగటుతో ఆరు శతకాలతో ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచాడు. 29 ఏళ్ల వయసులోనే కోహ్లీ వన్డేల్లో 32 శతకాలు సాధించి, సచిన్‌ 49 శతకాల రికార్డును ఎప్పుడు అధిగమిస్తాడని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

chahal won the icc t20 player award

అదేవిధంగా ఐసీసీ టెస్ట్ కెప్టెన్, ఐసీసీ వన్డే కెప్టెన్‌గా కూడా కోహ్లీ ఎంపికయ్యాడు. అయితే గత ఏడాది సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌ ట్రోఫీని రవిచంద్రన్‌ అశ్విన్‌ సొంతం చేసుకున్నాడు. అలాగే భారత యువ ఆటగాడు చాహల్‌ ఐసీసీ టీ20 ఫర్‌ఫామెన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గెలుచుకున్నాడు.

ఐసీసీ అవార్డ్స్ 2017..

ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- విరాట్ కోహ్లీ(భారత్)

ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా)

ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- విరాట్ కోహ్లీ(భారత్)

ఐసీసీ టీ20 ఫర్‌ఫామెన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌- చాహల్(భారత్)

ఐసీసీ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- రషీద్‌ ఖాన్‌(అఫ్గానిస్థాన్‌)

 ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌‌ ద ఇయర్‌: హాసన్‌ అలీ(పాకిస్థాన్‌)

ఫ్యాన్స్‌ మూమెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌- ఛాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్థాన్‌ కైవసం చేసుకోవడం.

ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- మరాయిస్‌ ఎరాస్‌మస్‌(దక్షిణాఫ్రికా)

మామాట: ఐసిసి ‘కింగ్’… దక్షిణాఫ్రికా సీరీస్‌లో ‘డంగే’..

English summary: After a super performance with the bat last year, Indian captain Virat Kohli swept ICC Awards as the 29-year won the prestigious Sir Garfield Sobers Trophy for being the World Cricketer of the Year 2017. Apart from the award, the Indian skipper was also named as ICC ODI cricketer of the year 2017 and the captain of both ICC Test and ODI teams. It is the second time Kohli has been named as the ODI cricketer of the year as he won the same honor in 2012.

Leave a Reply