పిఓకే పై  భారత్ దాడులు- మింగుడు పడని మీడియా

Indian Army, targets, Pakistani, military, administrate, offices, in, pok
Share Icons:

తిరుపతి, అక్టోబర్ 30,

భారత సైన్యం మరో మారు పాక్ పై  పంజా విసిరింది. ప్రధాని మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇవ్వగానే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న పాక్  సైనిక కార్యాలయాలు ధ్యేయంగా భారత సైనికులు దాడులు మొదలు పెట్టారు.  పీఓకే సరిహద్దు నుంచి 15-20 కిలోమీటర్ల వరకు లోనికి చొచ్చుకువెళ్లినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

మన వైపు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఈ నెల 23 వ తేదీన పాక్ సైన్యం పీఓకే  స్థావరంగా సరిహద్దుల్లోని  పూంచ్ సెక్టార్ ప్రాంతాలపై తూటాల వర్షం కురిపించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా గట్టి జవాబు చెప్పింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పోగలు చిమ్మినట్టు సరిహద్దు గ్రామస్తులు కూడా తెలిపారు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలకు హాని లేని రీతిలో కేవలం పాక్ సైనిక కార్యాలయాలపై దాడి చేసినట్టు భారత్ ఫోటో సాక్షాలను కూడా విడుదల చేసింది. ఇదే ప్రాంతంలో 2017లో పాక్ సైన్యానికి చెందిన 138 మంది మరణించారన్నారు.  అనంతర పాక్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు భారత్ కాల్పుల విరమణ అమలు చేస్తోందన్నారు. అందువల ఈ ఏడాది పాక్ సైనికుల మరణాలు గత ఏడాదికంటే తగ్గినట్టు తెలిపారు. అయితే పాక్ సైన్యం మాత్రం పీఓకే లోని నిరుద్యోగ యువతకు తీవ్రవాద బోధనలు ఒంటపట్టించి, వారిని అడ్డం పెట్టుకుని భారత్ పోస్టులపై దొడ్డిదారిలో దాడులకు పాల్పడుతున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. పాక్ చర్యలకు తగిన జవాబివ్వడానికి భారత్ సైన్యం సిద్దంగా ఉందనికూడా సైనిక ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది పాక్ వైపునుంచి 1591 మార్లు కవ్వింపు చర్యలు ఎదుర్కొన్నామన్నారు.

మరి ఇంత జరుగుతున్నా భారత్ మీడియా అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఎందుకో.. దేశ రక్షణ విషయంలో గత పాలకులకంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంటూ, కఠిన వైఖరి అవలంబిస్తోంది. నోటి మాటలతో కాకుండా తూటాకు తూటాతో జవాబిస్తోంది. మోదీ అధికారం చేపట్టిన తరవాత భారత విదేశీ విధానంలో అనూహ్యమైన మార్పులు సంభవించినా మన మీడియా దానిని గుర్తించడం లేదు. గతంలో లాగా భారత్ నేడు అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదు. మీకు నచ్చినవే కాదు, నచ్చనివి కూడా చేస్తాం. మాకు ప్రయోజనకరంగా  ఉంటే  ఎవరు వద్దన్నా వినమనే దృఢ వైఖరిని కేంద్రం కనబరుస్తోంది. ఇరాన్ తో ఆయిల్ కొనగోలు వ్యవహారం కానీ, రష్యాతో యుద్దవిమానాలు, అణు ఇంధనం ఒప్పందాలు కానీ, ఇటీవల జపాన్ లో ప్రధాని పర్యటన కానీ మన స్వంత అభిరుచి మేరకు, భారత్ భవిష్యత్ అవసరాల మేరకు జరుగుతున్న నిర్ణయాలు. మరి భారతీయ మీడియా, ముఖ్యంగా తెలుగు వంటి ప్రాంతీయ భాషల మీడియా ఈ విషయాలను ఎందుకు పట్టించుకోవవడం లేదో.. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ ఒక్కడిదే కాదు. ఆయన తీసుకునే నిర్ణయాలు భారత్ భవితను ప్రభావితం చేస్తాయి. మన తరువాతి తరాల వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అటు వంటి ప్రధాన నిర్ణయాలను మీడియా పట్టించుకోవాలి కదా, నిర్మొహమాటంగా మంచిని, చెడునూ విశ్లేషించాలి కదా, పాత్రికేయులకు ఆ బాధ్యత లేదా.

ప్రధానిగా మోదీ అనుసరిస్తున్న చాలా విధానాలతో మనం విభేదించ వచ్చు. మోదీతో వంద శాతం ఏకీభవించవలసిన పని లేదు. కానీ, జాతి విశాల ప్రయోజనాలు, దేశ దీర్ఘకాలిక ఉపయోగాల దృష్ట్యా కేంద్ర తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణాయలలోని మంచి చెడులను మీడియా జాతి జనులకు తేటపరచవలసి ఉంది.  ఈ ప్రాధమిక కర్తవ్యం నుంచి నేడు పత్రికలు, టీవీ రంగం తప్పించుకుంటోంది. మోదీ నచ్చకపోతే… శత్ర దేశాలను బలహీనపరిచే అతడి ఆలోచనలను అంగీకరించక పోతే నష్టం ఎవరికి. దృఢమైన భారత్ నిర్మాణానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలను అందరూ విభాతాలతో పనిలేకుండా సమర్థించవలసిన సమయం ఇది. పొరుగు దేశాల ముందు భారత్ పరువు నిలిపే చర్యలను కూడా వివక్షతో గమనించే పక్షపాత ధోరణికి మీడియా ముగింపు పలకాలి.

మామాట: ఈ మాటైనా వినిపిస్తుందా మీడియా ప్రపంచానికి .. .. 

 

Leave a Reply