సెంచరీతో చెలరేగిన కోహ్లీ…విండీస్ పై భారత్ ఘనవిజయం

Share Icons:

గయానా:

 

మూడు టీ20 మ్యాచ్ లని గెలుచుకుని సిరీస్ ని సొంతం చేసుకున్న టీమిండియా వన్డే మ్యాచ్ లో కూడా అదరగొట్టింది. మొదటి వన్డే వర్షం వలన టై అయిన్ రెండో వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఆదివారం ఇక్కడి క్వీన్‌పార్క్ ఓవెల్ మైదానంలో బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది.

 

కెప్టెన్ విరాట్ కోహ్లీ (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, 1 సిక్సర్) శతకంతో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్ (68 బంతుల్లో 71; 5 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ చేశాడు. టాపార్డర్ విఫలమైన చోట వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడటంతో విరాట్ సేన ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది.

 

అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. టార్గెట్ ఛేజింగ్‌కు దిగిన విండీస్ 42 ఓవర్లలో 210 పరుగలకి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ బౌలర్లలో భువీ 4 వికెట్లు, షమి, కుల్దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. విండీస్ లో లువిస్ 65 పరుగులు చేయగా, పూరన్ 42 పరుగులు చేశాడు. సెంచరీతో చెలరేగిన కోహ్లీకి మ్యాంక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

 

Leave a Reply