బ్యాటింగ్ లో రహనే..బౌలింగ్ లో బుమ్రా అదరగొట్టేశారు…తొలి టెస్ట్ ఇండియాదే

india won the first test against west indies
Share Icons:

ఆంటిగ్వా:

వరుసగా టీ20, వన్డే సిరీస్ లని గెలుచుకున్న టీమిండియా టెస్ట్ మ్యాచ్ లో కూడా అదరగొట్టింది. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రహానె(102), విహారి(93) రాణించడం.. బౌలింగ్‌లో బుమ్రా(5/7), ఇషాంత్(3/31) విజృంభించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా బోణీ చేసింది.

అంతకముందు టీమిండియా రహనే, విహారి లు అద్భుతంగా రాణించారు. ఫలితంగా 343/7 పరుగులకు డిక్లేర్ చేశారు. దీంతో ప్రత్యర్థికి 419 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్..కరీబియన్ జట్టును 100 పరుగులకే కుప్పకూల్చి అద్భుత విజయాన్నందుకుంది. విండీస్ బ్యాట్స్ మెన్ ప్యాడ్ కట్టుకున్నంతసేపు కూడా క్రీజులో నిలువలేకపోయారు. ఓ వైపు భారత్ పేసర్లు పదునైన బంతులతో విరుచుకుపడుతుంటే డిఫెన్స్ కూడా ఆడలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్లే డ్రెస్సింగ్ రూమ్‌కు క్యూ కట్టారు.

ఫలితంగా కోహ్లీసేన 318 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో అతిపెద్ద విజయం కావడం విశేషం. రెండు ఇన్నింగ్స్‌లో సూపర్ షో చేసిన రహానె(81, 102) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 297

వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 222

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 343 డిక్లేర్డ్‌ (112.3 ఓవర్లలో 7 వికెట్లకు)

వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 100 (26.5 ఓవర్లలో ఆలౌట్‌)

 

Leave a Reply