ఆసియా కప్‌లో కొనసాగుతున్న భారత్ జైత్రయాత్ర….

India won the bangladesh in asia cup
Share Icons:

దుబాయ్, 22 సెప్టెంబర్:

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్ జట్టు జైత్రయాత్ర కొంసాగుతుంది. గ్రూప్ దశలో హాంకాంగ్, పాకిస్థాన్‌జట్ల మీద విజయం సాధించిన టీమిండియా…నిన్న మొదలైన సూపర్-4 తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై  గెలిచింది.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభం నుంచే భారత బౌలర్లు చుక్కలు చూపెట్టారు. దాదాపు సంవత్సరం తర్వాత వన్డేల్లో బరిలోకి దిగిన లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా (4/29) బంగ్లా మిడిలార్డర్‌ను చెల్లాచెదురు చేశాడు. ఇతనికి తోడుగా పేసర్లు బుమ్రా (3/37), భువనేశ్వర్ (3/32) లైన్ అండ్ లెంగ్త్‌తో అదురగొట్టారు. ఓ దశలో 101 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాను మిరాజ్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. కెప్టెన్ మోర్తజా (26)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జోడించి నిలబెట్టాడు. దీంతో బంగ్లా 173 పరుగులకి ఆలౌట్ అయింది.

అనంతరం బరిలోకి దిగిన భారత్‌ 36.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి నెగ్గింది. రోహిత్‌ (104 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 నాటౌట్‌) అజేయ అర్ధ సెంచరీ చేయగా ధవన్‌ (40), ధోనీ (33) ఆకట్టుకున్నారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జడేజా నిలిచాడు. మరోవైపు సూపర్-4లో జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు హాంకాంగ్‌పై విజయం సాధించింది. హాంకాంగ్ నిర్ణీత 50 ఓవర్లలో 257 పరుగులు చేయగా, పాక్ ఆ లక్ష్యాన్ని 49.3 ఓవర్లలో చేధించింది.

ఇక సూపర్-4లో తదుపరి మ్యాచ్ భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం జరగనుంది.

మామాట: ఇదే ఊపు చివరి వరకు కొనసాగేనా….

Leave a Reply