పాక్‌ తో మ్యాచ్‌ కి అంతా సిద్ధం..

Share Icons:

నాటింగ్‌హామ్‌, 14 జూన్:

మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం భారత్‌ X పాక్‌ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ టోర్నీలో టీమిండియా రెండు వరుస విజయాలు సాధించగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ రద్దైంది. దీంతో ఐదు పాయింట్లతో భారత్‌ మూడోస్థానంలో కొనసాగుతోంది.

మరోవైపు పాక్‌ నాలుగు మ్యాచ్‌ల్లో రెండిట్లో ఓటమిపాలై.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ పేర్కొన్నాడు.

ఒత్తిడి, ఆందోళన లాంటి భావోద్వేగాలు కొత్తగా ఆడేవారిపై ప్రభావం చూపుతాయని, తాము నైపుణ్యం కలిగిన ఆటగాళ్లమని చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరి మధ్యా గట్టి పోటీ ఉందని, అయినా పాక్ మ్యాచ్‌లో సత్తా చాటుతామని అన్నాడు.

Leave a Reply