కివీస్ బౌలర్ల దెబ్బకి 92 పరుగులకే కుప్పకూలిన టీమిండియా……

Share Icons:

హామిల్టన్, 31 జనవరి:

ఐదు వన్డేల సిరీస్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా నాలుగో వన్డేలో మితిమీరిన అతి విశ్వాసం ప్రదర్శించింది. ఇప్పటికే సిరీస్ గెలిచామనే ఊపులో ఈరోజు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ని న్యూజిలాండ్ బౌలర్లు చావుదెబ్బ తీశారు.

కివీస్ పేసర్ బౌల్ట్ ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్ విలవిలాడరు. 21 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ శిఖర్ ధావన్ (13) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత వ‌రుస ఓవ‌ర్ల‌లో రోహిత్ శర్మ (7) , అంబటి రాయుడు (0), దినేశ్ కార్తీక్ (0) వరుస బంతుల్లో డకౌట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన శుభమన్ గిల్ (9) కూడా నిరాశపరిచాడు. బౌల్ట్ బౌలింగ్‌లో రిట‌ర్న్‌ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫాంలో ఉన్న కేదార్ జాద‌వ్‌ (1) అయిన ఆదుకుంటాడ‌ని భావించిన‌ప్ప‌టికి ఆయ‌న బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔట‌య్యాడు.

భువ‌నేశ్వ‌ర్ (1) కూడా త‌క్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత నాలుగు ఫోర్లు బడిన పాండ్యా(16) బౌల్ట్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక చహల్(18), కుల్దీప్(15) కాసేపు ఆడడంతో భార‌త్ 30.5 ఓవర్లలో 92 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక కివీస్ బౌలర్లలో బౌల్ట్ 5, గ్రాండ్ హోమ్ 3, అస్ట్లే 1, నేషమ్ 1 వికెట్ తీసుకున్నారు.

మామాట: ఓవర్ కాన్ఫిడెన్స్ కొంప ముంచినట్లుంది…

Leave a Reply