దుమ్ము దులిపిన బౌలర్లు..కివీస్ 157 ఆలౌట్..

Share Icons:

నేపియర్, జనవరి 23:

న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్‌ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో  భారత్ బౌలర్లు దుమ్ము దులిపారు. మొదట  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్ను కివీస్ బ్యాట్స్‌మెన్‌ని 38 ఓవర్లలోనే 157 పరుగులకే కట్టడి చేశారు. వైవిధ్యమైన బంతులతో బౌలర్లు రెచ్చిపోతే.. కళ్లుచెదిరే ఫీల్డింగ్‌తో ఫీల్డర్లు ఆకట్టుకుంటున్నారు. ఆరంభంలోనే తాను వేసిన వరుస ఓవర్లలో ఓపెనర్లిద్దరినీ పేసర్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఇక ఆ తర్వాత చహల్, కుల్దీప్ దెబ్బకి కివీస్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కి చేరారు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ ఒక్కడే 64 పరుగులతో జట్టుని ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరు సహకరించకపోవడంతో న్యూజిలాండ్ 157 పరుగులకే చాప చుట్టేసింది. భారత్ బౌలర్లలో షమీ 3, చహల్ 2, కుల్దీప్ 4, జాదవ్ 1 వికెట్ తీసుకున్నారు.

ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 2 ఓవర్లలో 5 పరుగులు చేసింది.

మామాట: గెలుపు సులువే…

Leave a Reply