సిరీస్ చిక్కినట్లేనా..?

india vs ireland second t-20 match otday
Share Icons:

డబ్లిన్, 29 జూన్:

టీమిండియా..ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఘనవిజయం సాధించి కఠినమైన ఇంగ్లండ్ పర్యటనకి ముందు శుభారంభం చేసింది.

ఆ మ్యాచ్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ చెలరేగడంతో ఏకంగా 76 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

అయితే శుక్రవారం జరిగే రెండో టీ20లోనూ గెలిచి సిరీస్ 2-0తో చేజిక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. దీని తర్వాత ఇంగ్లండ్  భారత్ మూడు టీ20ల సిరీస్.. ఆపై వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడబోతున్న సంగతి తెలిసిందే.

కానీ ఐర్లాండ్ అంత కఠిన ప్రత్యర్ధి కాకపోవడంతో రెండో టీ-20 మ్యాచ్‌లో భారత్ కొన్ని ప్రయోగాలు చేయాలని భావిస్తోంది.

అందులో భాగంగానే బెంచ్‌లో మిగిలిన వారిని కూడా పరీక్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఫామ్‌లో ఉన్నా లేకపోయినా రోహిత్, ధవన్, కోహ్లీ, ధోనీ, ఇద్దరు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ ఖచ్చితంగా జట్టులో చోటు ఉంటుంది.

ఒకవేళ ఆల్‌రౌండర్ పాండ్యాను వదిలేస్తే ముగ్గురు పూర్తిస్థాయి పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగొచ్చు. లేదంటే రైనా, పాండేలను కూర్చోబెడితే కార్తీక్, రాహుల్‌కు అవకాశం ఇవ్వొచ్చు. తొలి మ్యాచ్‌లో డకౌటయిన విరాట్ కూడా ఫామ్‌లోకి రావాలని కసరత్తులు చేస్తున్నాడు.

మొత్తం మీద తుది జట్టు కూర్పును పక్కనబెడితే బలమైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఈ మ్యాచ్‌లోనూ టీమ్‌ఇండియానే ఫేవరెట్‌గా దిగుతున్నది. మరోవైపు ఐర్లాండ్ ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తున్నది.

కొంతలో కొంతైనా ఇండియాకి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో తుది జట్టులో మార్పులు చేస్తున్నది. ఓ పెద్ద జట్టుతో రెండోసారి మ్యాచ్ ఆడే అవకాశం రావడంతో ఆటగాళ్లు కూడా తమ సత్తా ఏంటో చూపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

ఇక ఈరోజు రాత్రి 8.30 నుంచి సోని సిక్స్‌లో మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

మామాట: పసికూనలని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు..

Leave a Reply