ఓటమి అంచుల్లో భారత్..

india vs england fifth test
Share Icons:

లండన్, 11 సెప్టెంబర్:

అనుకున్నదే అయింది…ఐదో టెస్టు గెలిచి పరువు నిలుపుకోవాలని చూసిన భారత్‌….మరోసారి నిరాశపరుస్తూ…ఓటమి అంచున పయనిస్తోంది. ఓవైపు ఇంగ్లీష్ ఆటగాళ్లు శతకాలతో చెలరేగుతుంటే..పరుగుల వేటలో విఫలమైన కోహ్లీసేన దారుణంగా విఫలమైంది.

ఇంగ్లండ్ నిర్దేశించిన 464 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమ్‌ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. చేతిలో ఏడు వికెట్లు ఉన్న టీమ్‌ఇండియా ఓటమి నుంచి తప్పించుకోవడానికి 406 పరుగుల దూరంలో ఉన్నది.

ఓవర్‌నైట్ స్కోరు (114/2)తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్..423/8 వద్ద డిక్లేర్ చేసింది. భారత బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ కుక్(147), రూట్(125) పరుగులు సాధించారు. దీనికి తోడు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం వీరికి బాగా కలిసొచ్చింది. ఇక ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి(3/37) విడగొట్టాడు. ఒకే ఓవర్లో ఇద్దరిని పెవిలియన్ పంపి మూడో వికెట్‌కు 259 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరతీశాడు. ఆఖర్లో స్టోక్స్(37), స్యామ్ కర్రాన్(21), రషీద్(20) బ్యాట్లు ఝలిపించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు అందుకుంది. జడేజా(3/179), షమీ(2/110) రాణించారు.

అనంతరం 464 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకి కోలుకోలేని దెబ్బలు తగిలాయి. ఓపెనర్ ధావన్(1), పూజారా(0), కెప్టెన్ కోహ్లీ(0) వెంటవెంటనే ఔట్ అయ్యారు. ఇక ఆట ముగిసే సమయానికి మరో ఓపెనర్ రాహుల్(46), రహనే(10) పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే భారత్ గెలుపు ఎలాగో కష్టం కాబట్టి కనీసం ఈ ఒక్కరోజైనా బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడితే మ్యాచ్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

మామాట: ఓటమి ఖాయమే అనుకుంటా…!

Leave a Reply