సిరీస్ సమం చేస్తారా…

Share Icons:

అడిలైడ్, 14 జనవరి:

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన మొదటి వన్డేలోటీమిండియా ఘోరపరాజయం పాలైన విషయం తెలిసిందే. భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ వైఫల్యంతో ఆస్ట్రేలియా జట్టు సంచలన విజయం సాధించింది. అయితే మొదటి వన్డేలో తప్పిదాలని సరిదిద్దుకుని రెండో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. దీంతో రేపు అడిలైడ్ వేదికగా జరిగే రెండు వన్డే గెలిచేందుకు పక్కా ప్రణాళికతో దిగుతున్నారు.

ఇక కెప్టెన్ కోహ్లీ రెండో వన్డేను చాలెంజ్‌గా భావిస్తున్నాడు. నెట్స్‌లో సీరియస్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మిగతా ఆటగాళ్ల కంటే ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేశాడు. తొలి వన్డే హీరోలు…ఆస్ట్రేలియా యువ పేస్ బౌలర్లు జై రిచర్డ్‌సన్, జాసన్ బెహ్రన్డార్ఫ్‌ల జోరుకు చెక్ పెట్టాలని పట్టుదలతో ఉన్నాడు.

మరోవైపు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు బుమ్రాకి  విశ్రాంతినివ్వడంతో ఆ బాధ్యతను ఇప్పుడు భువనేశ్వర్‌ కుమార్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు బ్యాట్స్‌మెన్‌ పాదాలకు తగిలేలా యార్కర్లు విసరడం ప్రాక్టీస్ చేస్తున్నాడు.  ఇక ఆస్ట్రేలియా కూడా రెండో వన్డేని గెలిచి సిరీస్‌ని సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరి రెండు వన్డే ఎవరి సొంతమవుతుందో చూడాలి..

ఇరుజట్ల మధ్య మ్యాచ్ సోనీ సిక్స్‌లో రేపు ఉదయం 8:50లకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.

మామాట: సమిష్టిగా రాణిస్తే భారత్ విజయం ఆపడం కష్టమే…

Leave a Reply